18 ఏళ్లు నిండాయా..? పాన్ కార్డులో ఇవి అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి
Venkatrao Lella
Images: Pinterest
02 NOV 2026
పాన్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. దేశంలో ఆర్దిక లావాదేవీలు నిర్వహించాలంటే ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం చాలా అవసరం.
బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ లేదా విత్ డ్రా చేయాలన్నా పాన్ కార్డు అందించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు అవసరమవుతుంది.
మైనర్లకు కూడా పాన్ కార్డు అవసరం. వారి పేరుపై పెట్టుబడులు పెట్టడానికి, ఆస్తులు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అయితే 18 ఏళ్లు నిండాక వారి పాన్ కార్డులో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
మైనర్లుగా ఉన్నప్పుడు తీసుకున్న పాన్ కార్డులో తల్లిదండ్రుల వివరాలు ఉంటాయి. అందువల్ల 18 ఏళ్లు నిండాక పాన్ కార్డును తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఇబ్బందులు ఉండవు.
ఫొటో, సంతకాన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తికి రెండు కార్డులు జారీ చేయరు. దీంతో ప్రస్తుతం కార్డులోనే మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలు, రిజిస్టర్డ్ పాన్ కార్డు ఏజెన్సీలను సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే ఆన్ లైన్ ద్వారా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.
ఐటీ శాఖకు చెందిన ప్రోటీన్ ఈ-గవర్నమెంట్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో పాన్ కరెక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత ప్రస్తుత పాన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఆధార్, సంతకం, ఫొటో అప్ లోడ్ చేయాలి. అనంతరం సేవా ఛార్జీలు చెల్లించాలి
అప్లికేషన్ సబ్మిట్ చేశాక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో ఉండే నెంబర్ ఆధారంగా మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అప్డే్ట్ అయ్యాక మీ కొత్త పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.