బంగారం కొంటున్నారా..? ఈ తప్పులు చేస్తే మోసపోతారు జాగ్రత్త

Venkatrao Lella

Images: Pinterest

03 NOV 2026

బంగారాన్ని భారతీయులు అత్యంత విలువైన ఆస్తిగా పరిగణిస్తారు. దీంతో గోల్డ్ కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పొరపాట్లు చేయకూడదు.

మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే 22 క్యారెట్ బంగారాన్ని మంచిది కాదు. 24 క్యారెట్ బంగారాన్ని  కొనుగోలు చేయడం మంచిది. 22 క్యారెట్ ఆభరణాలపై చెల్లించే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీని తిరిగి అమ్మినప్పుడు పొందలేరు.

24 క్యారెట్ గోల్డ్ అధిక స్వచ్ఛతను కలిగి ఉంటుంది. దీని వల్ల అమ్మేటప్పుడు దాని విలువను సులభంగా పొందవచ్చు. 22 క్యారెట్లలో రాగి, ఇతర లోహలు కలుపుతారు.

బంగారు నాణేలు కొనుగోలు చేసేటప్పుడు బరువును చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ప్రకటించిన బరువు కన్నా కొద్దిగా తక్కువ ఉండవచ్చు. దీంతో కొనుగోలు చేసేటప్పుడు నమ్మకమైన డిజిటల్ స్కేల్‌పై బరువును చూసుకోవాలి.

బంగారం స్వచ్ఛతకు BIS హాల్‌మార్క్ చెక్ చేసుకోవాలి. హాల్‌మార్క్ లేని లేదా నకిలీ హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేస్తే మోసపోవచ్చు.  వివరాలను BIS కేర్ యాప్ ద్వారా ధృవీకరించడం తప్పనిసరి.

ప్రతి బంగారు నాణెంపై BIS లోగో, ప్యూరిటీ, టెస్టింగ్ సెంటర్ మార్క్, జ్యువెలర్ ఐడెంటిఫికేషన్ మార్క్, హాల్‌మార్కింగ్ సంవత్సరం ఉండాలి. వీటిని జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి.

బంగారు నాణేలు లేదా బార్లలో స్వల్ప బరువు వ్యత్యాసాలు ఉండవచ్చు. ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ (BIS) నిర్దిష్ట టాలరెన్స్ పరిమితులను నిర్ణయించింది.  అధిక టాలరెన్స్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల  వాస్తవ బరువు కన్నా తక్కువకు కొనుగోలు చేసినట్లు అవుతుంది.

బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా GST ఇన్‌వాయిస్ తీసుకోవాలి. ఇన్‌వాయిస్ అనేది మీరు కొనుగోలు చేసిన బంగారానికి రుజువు. భవిష్యత్తులో  బంగారాన్ని విక్రయించినప్పుడు ఇన్‌వాయిస్ చాలా కీలకం.

బంగారం కొనుగోలు చేసేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, ప్యాకేజింగ్ ఛార్జీలు, సర్టిఫికేషన్ ఛార్జీలు వంటి ఇతర దాచిన ఛార్జీలు ఉండవచ్చు. తిరిగి విక్రయించేటప్పుడు కూడా బరువు తరుగుదల, తనిఖీ ఛార్జీలు వంటి డిడక్షన్‌లు ఉండవచ్చు. వీటిని తెలుసుకోవడం మంచిది.