AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: కోహ్లీ 74, అర్ష్‌దీప్ 4 వికెట్లు.. అయినా అన్షుల్ కాంబోజ్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు?

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 74 పరుగులు, అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో మెరిశారు. అయినా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అన్‌శుల్ కాంబోజ్‌కు దక్కింది. కేవలం రెండు వికెట్లు తీసిన అతడికి ఈ అవార్డు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.

IND vs NZ: కోహ్లీ 74, అర్ష్‌దీప్ 4 వికెట్లు.. అయినా అన్షుల్ కాంబోజ్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు?
Anshul Kamboj
Rakesh
|

Updated on: Nov 04, 2026 | 5:13 PM

Share

IND vs NZ: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులు చేసి అదరగొట్టాడు. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీసి కివీస్ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. అయినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మాత్రం అన్షుల్ కాంబోజ్‌కు దక్కింది. అతడు తీసింది కేవలం రెండు వికెట్లే. మరి కోహ్లీ, అర్ష్‌దీప్‌లను కాదని కాంబోజ్‌కు ఈ అవార్డు ఎందుకు ఇచ్చారనే సందేహం చాలామందికి వచ్చింది. దానికి ప్రధాన కారణం అతడి పొదుపైన బౌలింగే.

10 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చిన కాంబోజ్

ఈ మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా 46 బంతుల్లో బ్యాటర్లకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతులతో న్యూజిలాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్‌లను పెవిలియన్‌కు పంపించాడు. అర్ష్‌దీప్ నాలుగు వికెట్లు తీసినా 70 పరుగులు ఇచ్చాడు. కాంబోజ్ మాత్రం ప్రత్యర్థి పరుగుల వేగాన్ని పూర్తిగా తగ్గించాడు. ఈ కారణంగానే అతడి ప్రదర్శనకు అవార్డు దక్కింది.

తొలి మ్యాచ్‌లో నిరాశ

కాంబోజ్‌కు ఈ అవార్డు మరింత ప్రత్యేకం. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే 82 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత మరో అవకాశం రావడంతో తనను తాను నిరూపించుకున్నాడు. రెండో వన్డే మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తొలి మ్యాచ్‌లో ఎదురైన నిరాశ నుంచి ఇలా అద్భుతంగా కోలుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది.

రెండు వికెట్లతో అవార్డు అందుకున్న ఏడో బౌలర్

కేవలం రెండు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఏడో భారత బౌలర్‌గా కాంబోజ్ నిలిచాడు. గతంలో జస్ప్రీత్ బుమ్రా కూడా రెండేసి వికెట్లు తీసిన ప్రదర్శనలకు రెండుసార్లు ఈ అవార్డు అందుకున్నాడు. 1990లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో రెండు వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. దీంతో కాంబోజ్ పేరు కూడా ఈ ప్రత్యేక జాబితాలో చేరింది.

కోహ్లీ, గిల్ కీలక భాగస్వామ్యం

మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 185 పరుగులకు ఆలౌటైంది. టిమ్ సీఫర్ట్ 38, గ్లెన్ ఫిలిప్స్ 30 పరుగులు చేశారు. చివర్లో బ్లెయిర్ టిక్నర్ 34 పరుగులతో జట్టుకు ఉపయోగకరమైన స్కోరు అందించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ నాలుగు వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ రూపంలో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అతడు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కలిసి 104 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వర్షం కారణంగా డీఎల్ఎస్ పద్ధతిలో నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సులభంగా అందుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us