AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: బంగారం కాదు, వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!

ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. సామాన్యులు బంగారం కొనడం భారంగా మారడంతో, అందరి దృష్టి ఇప్పుడు వెండి ఆభరణాలపై పడింది. రకరకాల ట్రెండీ డిజైన్లు, ఆక్సిడైజ్డ్ మోడల్స్‌లో లభిస్తున్న సిల్వర్ జ్యువెలరీకి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే, దేశంలోనే అత్యంత నాణ్యమైన, యూనిక్ డిజైన్లు కలిగిన వెండి నగలను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే రాజస్థాన్‌లోని జైపూర్ సరైన గమ్యస్థానం.

Silver: బంగారం కాదు, వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!
Silver JewelleryImage Credit source: instagram
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2026 | 9:43 AM

Share

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో చాలామంది చూపు సిల్వర్ జ్యువెలరీ వైపు మళ్లుతోంది. మన దేశంలో అత్యంత నాణ్యమైన, ఆకర్షణీయమైన వెండి నగలు అతి తక్కువ ధరకు లభించే ప్రధాన నగరం రాజస్థాన్‌లోని జైపూర్. జైపూర్ నగరం దేశంలోనే అతిపెద్ద వెండి ఆభరణాల తయారీ కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ తరతరాలుగా హస్తకళల ద్వారా వెండి నగలు తయారుచేసే వేలాది మంది కళాకారులు ఉన్నారు. తయారీదారులు, కొనుగోలుదారుల మధ్య మధ్యవర్తులు ఉండకపోవడం వల్ల ఇక్కడ నగలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు జైపూర్ నుంచే వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు. జోహారీ బజార్ అనేది ఇది జైపూర్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన జ్యువెలరీ మార్కెట్. వెండి, రత్నాలు పొదిగిన నగలకు ఇది పెట్టింది పేరు. సంప్రదాయ రాజస్థానీ మోడల్స్, చేతితో చేసిన వెండి గాజులు ట్రిపోలియా బజార్‌లో చాలా చౌకగా దొరుకుతాయి.

తక్కువ బడ్జెట్‌లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, డైలీ వేర్ వెండి ఆభరణాలు కొనాలనుకునేవారికి బాపు బజార్ బెస్ట్ ఆప్షన్. సాంప్రదాయ రాజస్థానీ డిజైన్ల నుండి నేటి యూత్ ఇష్టపడే మోడర్న్ ఫ్యూజన్ డిజైన్ల వరకు ఇక్కడ లభిస్తాయి. అంతేకాకుండా రంగురంగుల విలువైన రత్నాలు పొదిగిన సిల్వర్ జ్యువెలరీకి జైపూర్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.

ఇవి కూడా చదవండి

కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు:

వెండి నగలు కొనే ముందు తప్పనిసరిగా 925 Sterling Silver హాల్‌మార్క్ ఉందో లేదో సరిచూసుకోవాలి. హోల్‌సేల్ మార్కెట్ కాబట్టి 2-3 షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలు పోల్చి చూసి కొనుగోలు చేయడం మంచిది. మీరు కూడా తక్కువ ధరకు, మంచి నాణ్యమైన సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే జైపూర్ మార్కెట్లను తప్పక సందర్శించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి..
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి..
పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా టబు.. స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్..
పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా టబు.. స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్..
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్