AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికి అద్భుత ఔషధం, సర్వరోగ నివారిణి అమృతవల్లి..! ఖాళీ కడుపుతో ఇలా వాడారంటే తిరుగులేని..

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల మూలికా మొక్కలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా అమృతం లాంటి గుణాలు కలిగి ఉన్న అద్భుతమైన మొక్క తిప్పతీగ. ఆయుర్వేదంలో ప్రాచీన కాలం నుండి తిప్పతీగను రకరకాల అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క ఆకులు, కాండం, వేర్లు.. ఇలా ప్రతి భాగం అపారమైన ఔషధ విలువలను కలిగి ఉంటుంది. తిప్పతీగతో చేసిన జ్యూస్, పౌడర్ లేదా కషాయం తీసుకోవడం ద్వారా శరీరానికి కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆరోగ్యానికి అద్భుత ఔషధం, సర్వరోగ నివారిణి అమృతవల్లి..! ఖాళీ కడుపుతో ఇలా వాడారంటే తిరుగులేని..
Giloy Juice Benefits
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2026 | 7:01 AM

Share

ఆయుర్వేద వైద్యంలో తిప్పతీగకు విశిష్ట స్థానం ఉంది. దీనిని అమృతవల్లి అని కూడా పిలుస్తారు. అంటే, అమృతం వలే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే గుణం దీనికి ఉందని అర్థం. ముఖ్యంగా మారుతున్న వాతావరణం వల్ల వచ్చే రకరకాల జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తాజా తిప్పతీగ రసం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ దీనిని సరైన మోతాదులో తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం:

తిప్పతీగ యాంటీఆక్సిడెంట్లకు నిలయం. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలను రక్షిస్తుంది. తిప్పతీగ శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. క్రమం తప్పకుండా తిప్పతీగ రసం లేదా కషాయం తాగడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో, రకరకాల వైరల్ జ్వరాలతో పోరాడే శక్తిని పొందుతుంది.

జ్వరాల నివారణ:

తిప్పతీగలో సహజసిద్ధమైన జ్వరాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా లేదా ఇతర దీర్ఘకాలిక జ్వరాలతో బాధపడేవారికి ఇది అద్భుత ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం సమయంలో తగ్గే రక్త ప్లేట్‌లెట్లను పెంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

శ్వాసకోశ సమస్యలకు చెక్:

తిప్పతీగలో ఉన్న అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తరచుగా వేధించే దగ్గు, జలుబు, టాన్సిలిటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం అందిస్తాయి. ఆస్తమాతో బాధపడేవారికి ఛాతీ బిగుతు, శ్వాస ఆడకపోవడం, గురక వంటి లక్షణాలను తగ్గించడంలో ఇది ఎంతో మేలు చేస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేయడం:

తిప్పతీగ రసం శరీరంలోని కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

జీర్ణక్రియ, మలబద్ధకం నివారణ:

తిప్పతీగ రసం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. తిప్పతీగ ఆకులను బెల్లంతో కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య నుండి త్వరిత ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పొట్టలో గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి వాటిని తగ్గించడంలో తిప్పతీగ ఉపయోగపడుతుంది. అరకప్పు నీటిలో కొద్దిగా తిప్పతీగ రసం కలిపి తాగితే జీర్ణక్రియ సులువవుతుంది.

కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు:

కీళ్ల వాపు, నొప్పులు, మంట ఉన్నవారు తిప్పతీగ వేర్ల కషాయాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే రోజుకు 10-20 మి.లీ తిప్పతీగ రసాన్ని తీసుకోవడం వల్ల రకరకాల చర్మ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.

కంటి చూపు మెరుగుదలకు:

తిప్పతీగ వేర్లు, త్రిఫల చూర్ణం కలిపి తయారు చేసిన కషాయాన్ని తేనెతో కలిపి క్రమంగా తీసుకుంటే కంటి సమస్యలు తగ్గి చూపు మెరుగుపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:

మధుమేహం ఉన్నవారికి తిప్పతీగ ఒక హైపోగ్లైసిమిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

ఉపయోగించే విధానం:

తిప్పతీగ తాజా కాండాన్ని చిన్న ముక్కలుగా చేసి దంచి, నీటిలో మరిగించి లేదా జ్యూస్ చేసి తాగవచ్చు. ఉదయాన్నే పరగడుపున 15-20 మి.లీ రసాన్ని కొద్దిగా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం శ్రేయస్కరం.

(Disclaimer: ఈ సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us