AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.1.5 లక్షలు అడిగిన లాయర్.. ఏఐ సాయంతో రూ.2,432తో పని పూర్తి!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో క్లిష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేస్తున్నాం. పుణెకు చెందిన ఓ మహిళ తన ఇంటి ఆస్తికి సంబంధించిన పేరు మార్పు ప్రక్రియను ఏఐ సాయంతో పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు. ఇందుకోసం ఓ లాయర్ రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పగా.. ఆమె మాత్రం కేవలం రూ 2,432తోనే ఆ పని పూర్తి చేసారు. అదెలా సాధ్యమైందంటే..

రూ.1.5 లక్షలు అడిగిన లాయర్.. ఏఐ సాయంతో రూ.2,432తో పని పూర్తి!
Pune Techie Lawyer Quoted Lakhs For Property Name Change She Did It Cheap With Ai
Sharada V
|

Updated on: Nov 02, 2026 | 10:18 PM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో క్లిష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేస్తున్నాం. పుణెకు చెందిన ఓ మహిళ తన ఇంటి ఆస్తికి సంబంధించిన పేరు మార్పు ప్రక్రియను ఏఐ సాయంతో పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు. ఇందుకోసం ఓ లాయర్ రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పగా.. ఆమె మాత్రం కేవలం రూ 2,432తోనే ఆ పని పూర్తి చేసారు.

భర్త మరణంతో పెరిగిన బాధ్యతలు

పుణెకు చెందిన 38 ఏళ్ల విదులా బెంబాల్కర్ ఐటీ రంగంలో 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఆమె భర్త మరణించారు. ఇటీవల పుణెలోని పింప్రి-చించ్‌వాడ్ ప్రాంతంలో ఉన్న ఆమె ఆస్తి డెవలప్‌మెంట్ పనులకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేస్తున్న సమయంలో ఓ సమస్య ఎదురైంది. ఆస్తి పన్ను రికార్డుల్లో తన భర్త పేరును తొలగించి, తన పేరు మీద మార్చుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం న్యాయవాదిని సంప్రదించగా.. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పినట్లు విదులా వెల్లడించారు.

చాట్‌జీపీటీ, జెమినీతో సమస్యకు పరిష్కారం

అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం ఇష్టం లేని విదులా మరో మార్గం కోసం ప్రయత్నించారు. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ ఏఐ టూల్స్‌ను సంప్రదించారు. ఆస్తి పన్ను రికార్డుల్లో పేరు మార్చుకోవడానికి అనుసరించాల్సిన విధానం ఏమిటి? ఏయే పత్రాలు అవసరం? ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అడిగి తెలుసుకున్నారు. ఏఐ టూల్స్ సూచనలను అనుసరిస్తూ ఆన్‌లైన్‌లోనే ప్రక్రియను పూర్తి చేశారు. ఆస్తి రికార్డుల్లో పేరు మార్చుకోవడానికి విదులా భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఇండెక్స్ II డాక్యుమెంట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ (NOC) పత్రాలను సమర్పించారు. మున్సిపల్ ఆన్‌లైన్ పోర్టల్‌లోకి లాగిన్ అయి, ఆధార్ వివరాలను అనుసంధానం చేయగానే తన ఆస్తికి సంబంధించిన సమాచారం ఆటోమేటిక్‌గా కనిపించిందని ఈ పోర్టల్ సులభంగా ఉందని ఆమె చెప్పారు. అంతేకాదు, దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే అవకాశం ఉందన్నారు. తన దరఖాస్తును పరిశీలిస్తున్న అధికారి ఎవరు? దరఖాస్తు పరిశీలన సమయంలో అధికారులు ఏమని వ్యాఖ్యానించారు? వంటి వివరాలను కూడా ఆమె ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయగలిగారు. ఆశ్చర్యంగా ఇందుకోసం కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టిందట. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుల రూపంలో రూ.2,432 మాత్రమే ఖర్చు చేసినట్లు విదులా తెలిపారు.

 సామాన్యులకు ఏఐ ప్రయోజనకరం

ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన కొన్ని ప్రక్రియలు కష్టంగా ఉంటాయి. వాటిని ఎలా పూర్తి చేయాలో తెలియక చాలామంది భయపడతారు. దీంతో మధ్యవర్తులు లేదా ఇతరులపై ఆధారపడతారు. ఏఐ టూల్స్ క్లిష్టమైన విధానాలను సులువైన భాషలో వివరించడం ద్వారా సామాన్యులకు ఎంతో సహాయపడతాయని విదుల అన్నారు. సరైన సమాచారం అందుబాటులో ఉంటే చాలా మంది తమ పనులను తామే చేసుకోవచ్చని తెలిపారు. రూ.1.5 లక్షలు ఖర్చవుతుందని భావించిన పనిని కేవలం రూ.2,432తో పూర్తిచేయడంతో ఏఐని సరైన విధంగా ఉపయోగించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని ఈ ఘటన నిరూపిస్తోంది.

Follow Us
రూ.1.5 లక్షలు అడిగిన లాయర్.. ఏఐ సాయంతో రూ.2,432తో పని పూర్తి!
రూ.1.5 లక్షలు అడిగిన లాయర్.. ఏఐ సాయంతో రూ.2,432తో పని పూర్తి!
పీనట్ బట్టర్ ఆరోగ్య లాభాలు.. ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా?
పీనట్ బట్టర్ ఆరోగ్య లాభాలు.. ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా?
క్యాబ్ ఖర్చులు తగ్గించుకోండి.. తక్కువ ధరకే పుష్పక్ ఏసీ బస్సులో..
క్యాబ్ ఖర్చులు తగ్గించుకోండి.. తక్కువ ధరకే పుష్పక్ ఏసీ బస్సులో..
భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్..తక్కువ ధరకే రెండు కొత్త ఫోన్లు
భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్..తక్కువ ధరకే రెండు కొత్త ఫోన్లు
రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం..
రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం..
 దీపావళికి ఈ కలర్స్ ట్రై చేయండి.. మీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా
 దీపావళికి ఈ కలర్స్ ట్రై చేయండి.. మీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా
వాటికి అడ్డుకట్ట వేయండి.. అమిత్ షాకు చిరంజీవి రిక్వెస్ట్
వాటికి అడ్డుకట్ట వేయండి.. అమిత్ షాకు చిరంజీవి రిక్వెస్ట్
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
టమాటా మొక్క పూత రాలిపోతుందా?.. ఈ చిన్న చిట్కా పాటించండి
టమాటా మొక్క పూత రాలిపోతుందా?.. ఈ చిన్న చిట్కా పాటించండి