AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు

పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలితో జరిగిన గొడవ అనంతరం ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ప్రియురాలిని బైక్‌పై సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో స్థానికులు ఇద్దరినీ రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది..

Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు
Man Drags Girlfriend On Bike On Road
Srilakshmi C
|

Updated on: Jul 29, 2026 | 6:13 PM

Share

నలంద, జులై 29: పెళ్లి విషయంలో జరిగిన వివాదం ఓ యువతిని తీవ్ర ప్రమాదంలోకి నెట్టింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు, ఆమెను బైక్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బీహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన యువకుడు, రాజ్‌గిర్‌కు చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల ఆ యువతి రాజ్‌గిర్‌కు వచ్చి ప్రియుడిని కలిసింది. ఈ సమయంలో మరోసారి పెళ్లి విషయాన్ని ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నవాడా జిల్లాలోని నర్దీగంజ్ బ్లాక్‌లో సర్వే అధికారిగా పనిచేస్తున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని యువకుడు నిర్ణయించుకున్నాడు. యువకుడు బైక్‌ స్టార్ట్‌ చేసి వెళ్లేందుకు ప్రయత్నించగా, యువతి అతడిని ఆపేందుకు బైక్‌ను పట్టుకుంది. అయితే బైక్‌ను ఆపకుండా ముందుకు నడిపించడంతో యువతి రోడ్డుపై పడిపోయి సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లబడింది. ఈ దృశ్యాలను అక్కడికి సమీపంలో ఉన్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. బైక్ ఆపాలని అరుస్తూ కొందరు యువకుడి వెంట పరుగెత్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు.

ప్రియుడిని చితకబాదిన స్థానికులు

ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని యువతిని రక్షించి, యువకుడిని చితకబాదారు. ఈ సమయంలో యువకుడు ఆమె తన భార్య అని, ఇది కుటుంబ సమస్య అని చెప్పాడు. అయితే ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్‌గిర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిజీత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటన నాలుగైదు రోజుల క్రితం జరిగిందని తెలిపారు. ప్రేమ సంబంధంలో తలెత్తిన వివాహ వివాదమే దీనికి కారణమని వెల్లడించారు. యువతి నవాడాలోని నర్దీగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని, ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మరోసారి సంబంధాల్లో తలెత్తే వివాదాలను హింసాత్మకంగా పరిష్కరించకూడదని, చట్టపరమైన మార్గాలను ఆశ్రయించాలని సూచిస్తోంది.

Follow Us
బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
బెడిసి కొట్టిన యవ్వారం.. ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అప్పుడే ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్
గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్
అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!
అబ్బబ్బ.. ఏకంగా 20 శాతం డిస్కౌంట్.. మెడికల్ షాపులకు DMart ఝలక్..!
తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
ఈ ఆకులు బంగారం కంటే విలువైనది.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం
ఈ ఆకులు బంగారం కంటే విలువైనది.. సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం
ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదానే..
ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదానే..
27 సార్లు ఫెయిల్.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ
27 సార్లు ఫెయిల్.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ