Aarti Rules: ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసా..
అత్యంత భక్తితో, విశ్వాసంతో చేసే హారతి ఆరాధనకు పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అయితే హారతి ఇవ్వడానికి కూడా కొన్ని పద్ధతులు, నియమాలున్నాయి. వీటిని విస్మరించడం వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు.
హిందూ సనాతన సంప్రదాయంలో దేవతార్చనలో మంగళ హారతి ముఖ్యమైన భాగం. పూజ పూర్తయిన తరువాత కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు. హారతి లేకుండా చేసే పూజలను అసంపూర్ణంగా పరిగణిస్తారు. భగవంతునికి చేసే పూజ ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు తిప్పుతూ హారతినిస్తారు. భగవంతుని ఆరాధనలో భావావేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కనుక అత్యంత భక్తితో, విశ్వాసంతో చేసే హారతి ఆరాధనకు పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అయితే హారతి ఇవ్వడానికి కూడా కొన్ని పద్ధతులు, నియమాలున్నాయి. వీటిని విస్మరించడం వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు. కనుక హారతినిచ్చే సమయంలో ఏయే విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలో తెలుసుకుందాం.. తద్వారా దేవుడు త్వరగా ప్రసన్నుడవుతాడు. ఈరోజు హారతి ఇచ్చే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం..
హారతికి సంబంధించిన నియమాలు
- ఉదయం, సాయంత్రం రెండు పూటలా భగవంతుడిని పూజించడం ఎంతో పుణ్యప్రదమని విశ్వాసం. ఆరతి ఇచ్చే ముందు.. పూజా పళ్ళెంలో పసుపు, కుంకుమలతో స్వస్తిక్ వేసి అందులో పూలు సమర్పించి దీపం పెట్టాలని గుర్తుంచుకోండి.
- ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆరతి ఇచ్చే ముందు ఆరతి ఇచ్చిన తర్వాత.. తప్పనిసరిగా శంఖాన్ని ఊదాలి. వీలైతే, ఆరతి సమయంలో, మధ్యలో కూడా శంఖం ఊదవచ్చు.
- ఆరతిని ఇచ్చే సమయంలో ఓం అక్షరం ఆకారంలో ప్లేట్‌ను తిప్పడానికి ప్రయత్నించండి.
- భగవంతుని ఆరతి ఇచ్చే సమయంలో హారతి ఇచ్చే ప్లేట్ ను దేవుళ్ల పాదాల వైపు నాలుగు సార్లు, నాభి వైపు రెండుసార్లు, చివరిగా ఒకసారి దేవుళ్ల ముఖానికి చూపించంచాలి. ఈ మొత్తం ప్రక్రియను మొత్తం ఏడు సార్లు పునరావృతం చేయండి.
- ఆరతి ఇచ్చే సమయంలో.. ఇప్పటికే వెలిగించిన దీపాన్ని , వత్తిని లేదా కర్పూరాన్ని మళ్ళీ వెలిగించకూడదని గుర్తుంచుకోండి. మట్టి దీపం ఉంటే.. దాని స్థానంలో కొత్త దీపం, లోహంతో చేసిన దీపం అయితే దానిని కడిగిన తర్వాత మాత్రమే మళ్లీ ఉపయోగించండి.
- దేవతలకు హారతినిచ్చే సమయంలో అక్కడ కూర్చోకూడదని గుర్తుంచుకోండి. ఒకవేళ శారీరకంగా నిలబడలేకపోయినా, లేదా ఏదైనా కారణం వల్ల నిలబడలేకపోయినా.. మీరు భగవంతునికి క్షమాపణలు చెప్పుకుని ఆరతి పూర్తి చేయవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)