AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: భార్యాభర్తల బంధం నిలబడాలంటే చాణక్య చెప్పిన ఈ విషయాలు నేటి జనరేషన్ తెలుసుకోవాల్సిందే…

రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలు నీతి శాస్త్రంలో వివరించారు. ఇందులో వైవాహిక జీవితం, కెరీర్, ఆరోగ్యం, మనుషుల మధ్య సంబంధాలు, ఉద్యోగానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు.

Chanakya Niti: భార్యాభర్తల బంధం నిలబడాలంటే చాణక్య చెప్పిన ఈ విషయాలు నేటి జనరేషన్ తెలుసుకోవాల్సిందే...
Chanakya Neeti
Surya Kala
|

Updated on: Dec 10, 2022 | 1:09 PM

Share

ఆచార్య చాణక్యుడు తన విధానాల వల్ల నేటికీ ప్రసిద్ధి చెందాడు.చాణక్యుడికి రాజకీయాలకే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి అంశంపై లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. చాణక్యుడు గొప్ప రాజకీయ వేత్త, దౌత్యవేత్త. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి .. వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా పాలక వర్గ సభ్యునిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలను తెలియజేశారు. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలు నీతి శాస్త్రంలో వివరించారు. ఇందులో వైవాహిక జీవితం, కెరీర్, ఆరోగ్యం, మనుషుల మధ్య సంబంధాలు, ఉద్యోగానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. జీవితంలో భార్యాభర్తల మధ్య సంబంధాన్ని గురించి చెప్పారు.. ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల బంధంపై ప్రభావం చూపించే అనేక విషయాలను పేర్కొన్నాడు.

 భార్యాభర్తల బంధాన్ని బలహీన పరిచే కారణాలు ఏమిటంటే..!

  1. చాణక్య నీతి ప్రకారం, భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనపడటానికి అతి పెద్ద కారణం అహం. భార్యాభర్తల సంబంధంలో అహంకారానికి తావు ఇవ్వరాదని సూచించాడు.
  2. భార్యాభర్తల మధ్య సంబంధంలో సందేహాలకు తావు ఉండకూడదని చాణక్యుడు పేర్కొన్నాడు. అనుమానం దంపతుల మధ్య అగాధం సృష్టిస్తుంది.. సంబంధాన్ని నాశనం చేస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. భార్యాభర్తల సంబంధంలో అనుమానం, అపార్ధాలు ఏర్పడిన తర్వాత.. ఆ సంబంధం పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. అందుకే భార్యాభర్తల మధ్య బంధం మధ్య అనుమానం రాకూడదు.
  5. చాణక్యుడి ప్రకారం అబద్ధాల సహాయంతో ఏ సంబంధమూ నిలబడదు. ఎప్పుడైతే ఏ రిలేషన్‌షిప్‌లో నైనా అబద్ధం చోటు చేసుకుంటే..  వ్యక్తిగత జీవితంలో సమస్యలు రావడం ఖాయం.
  6. భార్యాభర్తల బంధంలో గౌరవం లేకపోవడం వల్ల ఆ బంధం తెగిపోయే దశకు చేరుకుంటుందని.. చాణక్య విధానంలో చెప్పబడింది. అందుకే భార్యాభర్తల సంబంధంలో పరస్పర గౌరవం, అవగాహన అవసరం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు