Horoscope Today: ఈ రాశి రైతులకు శుభకాలం.. ధన లాభం.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

రోజులో జరిగే మంచి, చెడుల గురించి. ఈ నేపథ్యంలో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈరోజు (డిసెంబర్ 10 తేదీ ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈ రాశి రైతులకు శుభకాలం.. ధన లాభం.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2022 | 6:32 AM

Horoscope Today (10-12-2022): రోజు మొదలైతే మనిషి ముందుగా ఆలోచించేది.. రోజులో జరిగే మంచి, చెడుల గురించి. ఈ నేపథ్యంలో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈరోజు (డిసెంబర్ 10 తేదీ ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ  రోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అనవసరంగా భయాందోళనలకు గురికాకుండా పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు నిరుత్సాహపడే విధంగా కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక దైర్యం మిమ్మల్ని విజయం వైపు పయనింపజేస్తుంది. అలసట పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి ప్రారంభించిన పనుల్లో విజయాన్ని అందుకుంటారు. ఆశించిన ఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో సక్సెస్ అందుకుంటారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. బంధువులతో విబేధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులను ప్రణాళికలతో పూర్తి చేస్తారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు.  బంధు, మిత్రులతో విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక బలం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పనుల విషయంలో కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. బంధు, మిత్రులతో సంతోషముగా గడుపుతారు. ఆశించిన ఫలితాలను అందుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన సంఘటన జరుగుతుంది. అధిక శ్రమ పడతారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు అస్థిర నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కుటుంబంలో బాధ కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అధిక శ్రమ పడకుండా చూసుకోండి

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు ఇతరులను కలుపుకుని ముందుకు వెళ్తే శుభఫలితాలను అందుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనం మేలు. వృత్తి, వ్యాపార రంగాల్లోని వారు ఇతరులను కలుపుకొనిపోవాలి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించే పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ముఖ్య విషయాల్లో అవగాహనాలోపం రాకుండా చూసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు మాట పట్టింపులకు పోకుండా ఇతరుల సహకారంతో ప్రారంభించిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఆత్మబలంతో పట్టుదలతో విజయం సాధిస్తారు. ధన లాభం కలుగుతుంది. రైతులకు శుభకాలం. ఎవరినీ అతిగా నమ్మకండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే