Shankh Benefits: ఇంట్లో ఏ రకమైన శంఖాన్ని పూజించడం, ఊదడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందో తెలుసా

సనాతన సంప్రదాయంలో శుభప్రదానికి చిహ్నంగా పరిగణించబడే శంఖంలోని రకాలు,  దాని మతపరమైన, జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం

Shankh Benefits: ఇంట్లో ఏ రకమైన శంఖాన్ని పూజించడం, ఊదడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందో తెలుసా
Benefits Of Shanka
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2022 | 10:24 AM

హిందూ మతంలో శంఖానికి ప్రాముఖ్యత ఉంది. పూజలు, శుభకార్యాల్లో శంఖాన్ని ఉపయోగిస్తారు. సనాతన హిందూ ధర్మంలో.. మత విశ్వాసం ప్రకారం.. సముద్ర మథనం సమయంలో.. సంపద, విలువైన వస్తువులు, దేవతలతో పాటు శంఖం కూడా కనిపించింది. హిందూ మతంలో అన్ని రకాల శివలింగాలు, శాలిగ్రామాలను ఎలా పూజిస్తారో, అదే విధంగా వివిధ రకాల శంఖాలను పూజలో ఉపయోగిస్తారు. కొన్ని శంఖాలను ఊదడానికి, కొన్ని శంఖాలను పూజ, దర్శనానికి మాత్రమే మంగళకరమైనవిగా భావిస్తారు. సనాతన సంప్రదాయంలో శుభప్రదానికి చిహ్నంగా పరిగణించబడే శంఖంలోని రకాలు,  దాని మతపరమైన, జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం .

శంఖం లో ఎన్ని రకాలు ఉన్నాయంటే? సనాతన సంప్రదాయంలో శంఖాలలో వివిధ రకాలున్నాయి.  అయితే వీటిలో 10 రకాల శంఖాలు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతున్నాయి. వీటిలో కామధేను శంఖం, గణేష శంఖం, అన్నపూర్ణ శంఖం, మోతీ శంఖం, విష్ణు శంఖం, ఐరావత శంఖం, పౌండ్ర శంఖం, మణిపుష్ప శంఖం, దేవదత శంఖం, దక్షిణావర్తి శంఖం ఉన్నాయి. ఈ శంఖుస్థాపనలు ఉన్నవారి ఇంట్లో ఎల్లప్పుడూ సుఖసంతోషాలు, సంపదలు, సౌభాగ్యాలు ఉంటాయని విశ్వాసం.

శంఖాన్ని పూజించడం ద్వారా అదృష్టం మెరుగుపడుతుంది హిందూ మత విశ్వాసం ప్రకారం..  అన్ని శంఖాలకు దాని స్వంత ప్రాముఖ్యత. అన్ని శంఖాలు కొన్ని శుభ ఫలితాలను అందిస్తాయి, అయితే విష్ణు శంఖం, మోతి శంఖం, దక్షిణావర్తి శంఖాలను ఇంట్లో ఉంచి వాటిని పూజించడం వల్ల వ్యక్తికి శుభం కలుగుతుంది. జీవితంలో దేనికీ లోటు లేదు.

ఇవి కూడా చదవండి

శంఖాన్ని పూజించడం, ఊదడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1.  హిందూమతంలో.. శంఖం లక్ష్మీదేవికి సోదరునిగా పరిగణించబడుతుంది. శంఖాన్ని పూజించే ఇంట్లో, సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది.
  2. హిందూ విశ్వాసం ప్రకారం, ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించేటప్పుడు శంఖాన్ని ఊదడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా సమయానికి పూర్తి అవుతుంది.
  3. ప్రతిరోజూ పూజలో శంఖాన్ని ఊదడం వల్ల ఆ ఇంటిలోని ప్రతికూల శక్తి అంతా పోయి, అక్కడ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు.
  4. రోజూ శంఖం ఊదిన వ్యక్తి ఊపిరితిత్తులు ఎప్పుడూ బలంగా ఉండి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
  5. శంఖాన్ని  ఇంట్లో ఉంచితే వాస్తు దోషం తొలగిపోతుంది. శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే ఎలాంటి ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..