AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ 3 విషయాలు మనిషి జీవితంపై అత్యంత ప్రభావం చూపిస్తాయి.. ఇవి ఎప్పుడూ వదిలి పెట్టమంటున్న ఆచార్య చాణక్య

జీవితంలో విజయాన్ని సాధించడంలో మనిషికి సహాయపడే విషయాలను విధానాలను, నియమాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. వ్యక్తి జీవితానికి, జీవన విధానానికి, అలవాట్లకు సంబంధించిన విషయాలను ప్రస్తావించారు.

Chanakya Niti: ఈ 3 విషయాలు మనిషి జీవితంపై అత్యంత ప్రభావం చూపిస్తాయి.. ఇవి ఎప్పుడూ వదిలి పెట్టమంటున్న ఆచార్య చాణక్య
Acharya Chanakya
Surya Kala
|

Updated on: Dec 06, 2022 | 11:08 AM

Share

ఆచార్య చాణక్యుడు మంచి ఉపాధ్యాయుడే కాకుండా గొప్ప దౌత్యవేత్త, వ్యూహకర్త , ఆర్థికవేత్త. చాణక్యుడి విధానాలు నేటికీ ప్రసిద్ధి చెందాయి. జీవితంలో విజయం సాధించడానికి ప్రజలు ఇప్పటికీ ఈ విధానాలను అనుసరిస్తారు. నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి. జీవితంలో విజయాన్ని సాధించడంలో మనిషికి సహాయపడే విషయాలను విధానాలను, నియమాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. వ్యక్తి జీవితానికి, జీవన విధానానికి, అలవాట్లకు సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. ఈ విషయాలు చనిపోయే వరకు వ్యక్తిని విడిచిపెట్టవు. ఆ విషయాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.

జ్ఞానం: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. జ్ఞానం అనేది మనిషికి అతిపెద్ద ఆయుధం. ఇది జీవితాంతం వ్యక్తితో ఉంటుంది. జీవితంలో అందరూ మిమ్మల్ని  విడిచిపెట్టవచ్చు. కానీ జ్ఞానం ఒక్కటే మీతో కలకాలం నిలిచి ఉంటుంది. తెలివితేటల బలంతో, ఒక వ్యక్తి ఎటువంటి క్లిష్ట పరిస్థితి నుండి అయినా బయటపడగలడు. విద్య , జ్ఞానం ద్వారానే వ్యక్తి విజయం సాధిస్తాడు.

ఔషధం: ఏదొక సమయంలో వ్యాధి బారిన పడని మనిషి అంటూ లోకంలో ఉండరు. అయితే ఏదైనా వ్యాధి నుండి బయటపడటానికి వైద్యం నిజమైన స్నేహితుడిలా పనిచేస్తుంది. దీనివల్ల మనిషి త్వరగా కోలుకుంటాడు. ఔషధం సహాయంతో.. ఎటువంటి వ్యాధినైనా ఆరోగ్య సమస్యనైనా సులభంగా వదిలించుకోవచ్చు. వైద్యం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మతం: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మనిషి మతాన్ని సంపద కంటే ఎక్కువగా భావించాలి. మతం ఒక వ్యక్తిని బ్రతికుండగానే కాదు, మరణానంతరం కూడా వెంటవస్తుంది. మనిషిని సన్మార్గంలో నడవడానికి మతం స్ఫూర్తినిస్తుంది. మతం, కర్మ కారణంగా.. మనిషి మరణం తర్వాత కూడా ఎల్లప్పుడూ స్మరించబడతాడు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముదురుతున్న సంక్షోభం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముదురుతున్న సంక్షోభం
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం శుభవార్త
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం శుభవార్త
16 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం..
16 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం..
క్యాప్సికంను నిర్లక్ష్యం చేయొద్దు… ఆరోగ్యానికి ఇది బంగారం!
క్యాప్సికంను నిర్లక్ష్యం చేయొద్దు… ఆరోగ్యానికి ఇది బంగారం!
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది