Horoscope 2023: కొత్త ఏడాదిలో ఈ 5 రాశులవారు ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి.. అందులో మీరున్నారా.. చెక్ చేసుకోండి ఇలా

భవిష్యత్ పై అనేక ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి ఎదురుచూస్తున్నారు. అయితే రానున్న ఏడాదిలోనైనా తమ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలుసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో రానున్న ఏడాదిలో ఏ రాశివారికి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందో తెలుసుకుందాం.. 

Horoscope 2023: కొత్త ఏడాదిలో ఈ 5 రాశులవారు ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి.. అందులో మీరున్నారా.. చెక్ చేసుకోండి ఇలా
Horoscope-Zodiac Signs
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2022 | 3:04 PM

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2023లోకి అడుగు పెట్టనున్నాం.. దీంతో చాలా మంది కొత్త సంవత్సరంపై అనేక ఆశలు పెట్టుకున్నారు. గడచిన 2022 సంవత్సరంలో నెరవేర్చలేని తమ కోరికలు కనీసం వచ్చే 2023లో నైనా నెరవేరుతాయా అని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కష్టపడుతున్నారు. కనీసం వచ్చే ఏడాదిలో తమ కష్టాలు ఫలించి ప్రభుత్వ ఉద్యోగం దక్కాలని ఆలోచిస్తున్నారు. భవిష్యత్ పై అనేక ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి ఎదురుచూస్తున్నారు. అయితే రానున్న ఏడాదిలోనైనా తమ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలుసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో రానున్న ఏడాదిలో ఏ రాశివారికి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందో తెలుసుకుందాం..

జ్యోతిషశాస్త్రంలో బుధుడు, రవి, బృహస్పతి గ్రహాలు ఉద్యోగ, వ్యాపార కారకాలుగా పరిగణించబడతాయి. ఉన్నత స్థానం, ప్రభుత్వ ఉద్యోగం, వ్యాపారం, సమాజంలో గౌరవం పొందడంలో ఈ మూడు గ్రహాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరంలో ఏ రాశుల వారికి ఉద్యోగం లభిస్తుందో లేదా ఉద్యోగం చేస్తున్న వారు ఎంత పురోభివృద్ధికి వెళ్తారో చూద్దాం..

2023 సంవత్సరం:  2023 సంవత్సరం ప్రారంభం కాకముందే బుధ గ్రహ సంచారం తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. బుధుడు 03 డిసెంబర్ 2022న ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. అనంతరం బుధుడు డిసెంబర్ 28న మకర రాశిలోకి  ప్రవేశించనున్నాడు. అనంతరం 3 రోజుల తర్వాత డిసెంబర్ 31న బుధుడు తిరోగమనం చెంది మళ్లీ ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తర్వాత ఫిబ్రవరి 7న బుధుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మరోవైపు 2023 సంవత్సరంలో, బృహస్పతి, సూర్యుడు, శని గ్రహాలు కూడా తమ రాశిని మార్చుకుంటాయి.

ఇవి కూడా చదవండి

మేషరాశి: ఉద్యోగ పరంగా..  మేష రాశి వారికి 2023 సంవత్సరం గొప్పగా ఉంటుంది. ఈ సంవత్సరం చాలా మంచి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.  మేష రాశిలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఏప్రిల్ 22, 2023న.. శుభ ఫలితాలను ఇచ్చే బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు, ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. బుధుడు, రవి ఈ రాశిలో 9 వ ఇంట్లో ఉండనున్నారు. దీంతో ఈ రాశివారికి ఈ సంవత్సరం అదృష్టం సొంతమవుతుంది. దీంతో వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారాలలో మంచి అవకాశాలను పొందుతారు. ఈ సంవత్సరం మధ్యలో మంచి ఉద్యోగం పొందడానికి బలమైన అవకాశాలు లభిస్తాయి.

సింహరాశి: మీ రాశికి ఐదవ ఇంట్లో బుధుడు, సూర్యుని సంచారం బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తుంది. కనుక ఈ సంవత్సరం సింహ రాశికి కూడా చాలా మంచిది. కెరీర్‌లో మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి. గ్రహాల శుభ సంచారంతో ఈ రాశివారికి ఏడాది పొడవునా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం చివరిలో శుభవార్త వింటారు. మరోవైపు ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు.

తులరాశి: ఈ సంవత్సరం ఈ రాశి వారి శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనిలో మంచి విజయం లభిస్తుంది. ఏడాది పొడవునా అదృష్టంతో పాటు అద్భుతమైన మార్గంలో గడిచిపోతుంది. వీరు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు పొందుతారు. మంచి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు లభించడంతో ఈ రాశివారు భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. మరోవైపు, ఏ వృత్తిలో ఉన్నా.. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంటుంది.

ధనుస్సు రాశి: 2023లో ధనుస్సు రాశి వారికి ఏలిన నాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. రవి, బృహస్పతి రాశుల మార్పు ధనుస్సు రాశి వారికి వరం కంటే తక్కువ కాదు. ఈ సంవత్సరం ఈ రాశివారికి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లవచ్చు లేదా విదేశాలలో ఉద్యోగం పొందవచ్చు. ఉద్యోగంలో ఈ సంవత్సరం వీరికి మంచి జీతం లభిస్తుంది. ఏడాది పొడవునా.. ఈ రాశివారు సీనియర్ల నుండి మంచి మద్దతు పొందుతారు. దీంతో ఉద్యోగావకాశాల్లో  పురోగతిని పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!