Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Thoughts: మట్టిని కూడా బంగారంగా మార్చే శక్తి గురువుకు ఉంది.. జీవితంలో గురువు విశిష్టత ఏమిటో తెలుసా..

మన సాంప్రదాయంలో గురువుకు అత్యుత్తమ స్థానం ఉంది. "గురుబ్రహ్మ గురుర్విష్టు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః" అని గురువుకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు.

Motivational Thoughts: మట్టిని కూడా బంగారంగా మార్చే శక్తి గురువుకు ఉంది.. జీవితంలో గురువు విశిష్టత ఏమిటో తెలుసా..
Motivational Thoughts
Follow us
Surya Kala

|

Updated on: Dec 06, 2022 | 8:32 AM

ప్రతి వ్యక్తికి జీవితంలో ఖచ్చితంగా ఏదొక రూపంలో గురువు అవసరం. మనిషిలో అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకురాగల వ్యక్తి గురువు. సత్యం , అసత్యం మధ్య తేడాను గుర్తించడం నేర్పే గురువు. అందుకనే గురువు గోవిందుడితో సమానమని చెబుతారు. గురువు లేకుండా శిష్యుడు జ్ఞానం పొందడం అసాధ్యమంటారు. మనిషి జీవితానికి సంబంధించిన జ్ఞానం గురువు ద్వారానే లభిస్తుంది. అయితే కొన్నిసార్లు కొంతమందికి అలాంటి గురువులు చాలా తేలికగా దొరుకుతారు.. కొందరికి దురదృష్టవశాత్తు చాలా కాలం వెతికినా గురువు దొరకరు. అటువంటి పరిస్థితిలో జీవితంలో తప్పొప్పుల గురించి చెప్పి.. భగవంతు గురించి జ్ఞానాన్ని అందించే నిజమైన గురువు, గుణాలు ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. మన సాంప్రదాయంలో గురువుకు అత్యుత్తమ స్థానం ఉంది. “గురుబ్రహ్మ గురుర్విష్టు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః” అని గురువుకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు. భగవంతునికంటే ముందు గురువును ఆరాధించాలని ఎందుకు  చెప్పారు..మనిషిని అభివృద్ధి పథంలో పయనింపజేసే నిజమైన గురువు  గురించి తెలుసుకుందాం..

  1. మట్టిని కూడా బంగారంగా మార్చగల అద్భుత శక్తి గురువుకు ఉంది.
  2. జీవితానుభవం ఒక కఠినమైన గురువు ఎందుకంటే అది మొదట మనిషికి పరీక్ష పెడుతుంది.. తరువాత బోధిస్తుంది.
  3. గురువులు తమ కన్న బిడ్డల కన్నా శిష్యులను ఎక్కువగా ప్రేమిస్తారు.. ఒక్కోసారి తమ కొడుకులకు కూడా చెప్పని మూల మంత్రములను శిష్యులకు ఇస్తారు.
  4. జీవితంలో రకరకాల గురువులు ఉంటారు. బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు కొందరు.. శిష్యునికి సన్మార్గం భోధించి మోక్ష మార్గం వైపు నడిపించే గురువు మరికొందరు.
  5. ఇవి కూడా చదవండి
  6. తన శిష్యులను సన్మార్గంలో నడిపించి, శిష్యుడిని సన్మార్గంలో ముందుకు సాగేలా ప్రేరేపించేవాడే నిజమైన గురువు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)