Mystery Temple: ఇక్కడకి వెళ్లిన ఏ జీవి ప్రాణాలతో ఇప్పటి వరకూ తిరిగి రాలేదు.. గేట్ ఆఫ్ హెల్ గురించి తెలుసుకోండి

హెరాపోలిస్ అనే నగరంలో అతి పురాతన ఆలయం ఉంది. దీనిని 'గేట్ ఆఫ్ హెల్' అని పిలుస్తారు. ఈ ఆలయం లోపలికి కాదు కదా.. చుట్టూ తిరిగే వ్యక్తులు కూడా తిరిగి రారు. అందుకనే ఈ ప్రదేశం ఎన్నో సంవత్సరాలు రహస్య ప్రాంతంగా ఉంది.

Mystery Temple: ఇక్కడకి వెళ్లిన ఏ జీవి ప్రాణాలతో ఇప్పటి వరకూ తిరిగి రాలేదు.. గేట్ ఆఫ్ హెల్ గురించి తెలుసుకోండి
Roman Gate To Hell Temple
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2022 | 8:05 AM

ప్రపంచంలో మానవ నిర్మిత రహస్యాలు కొన్ని అయితే.. ప్రకృతి సృష్టించిన కొన్ని రహస్యాలు అనేక ప్రదేశాలున్నాయి. వీటి గురించి తెలుసుకుంటే ఎవరైనా షాక్ తింటారు. అంతేకాదు కొందరు వ్యక్తులు ఆ రహస్యాన్ని ఛేదించడానికి లేదా.. నిజమా కదా అనే ఆలోచనతో అన్వేషణ సాగిస్తాడు. శాస్త్రజ్ఞులు చేసే పరిశోధనలో కొన్ని రహస్యాలు రీజన్ దొరికితే.. మరికొన్ని మిస్టరీస్ హిస్టరీలో సైన్స్ కు అందానివిగా మిగిలిపోతున్నాయి. ఈ రోజు మనం తెలుసుకోనున్న మిస్టరీ గేట్ ఆఫ్ హెల్ అంటే నరకానికి ద్వారం అని పిలుస్తారు. ఈ గుడిలోపలికి ఎంట్రీ నరమానవులకు లేదు. ఎందుకంటే ఈ గుడిలోపలికి వెళ్లిన వారు మళ్ళీ తిరిగిరాలేదని అంటారు. ఎన్నో మర్మాలను దాచుకున్న ఈ ఆలయం టర్కీలోని పురాతన నగరంలో ఉంది.

హెరాపోలిస్ అనే నగరంలో అతి పురాతన ఆలయం ఉంది. దీనిని ‘గేట్ ఆఫ్ హెల్’ అని పిలుస్తారు. ఈ ఆలయం లోపలికి కాదు కదా.. చుట్టూ తిరిగే వ్యక్తులు కూడా తిరిగి రారు. అందుకనే ఈ ప్రదేశం ఎన్నో సంవత్సరాలు రహస్య ప్రాంతంగా ఉంది. ఎందుకంటే గ్రీకు దేవుడి విషపూరితమైన శ్వాస ఇక్కడికి వచ్చిన వారిని చంపుతుందని ప్రజలు విశ్వసించారు. ఈ ఆలయాన్ని ‘ప్లూటో ఆలయం’ అని పిలుస్తారు. అంటే మృత్యుదేవుని ఆలయం. ఇక్కడ మృత్యుదేవత శ్వాస కారణంగా.. ఆలయాన్ని లేదా దాని పరిసరాలను సందర్శించే వారు చనిపోతారని నమ్ముతారు. తరచుగా మరణాలు సంభవిస్తున్నందున, ఈ ఆలయాన్ని ప్రజలు ‘నరక ద్వారం’ అని పిలుస్తారు.

మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు అయితే, చాలా సంవత్సరాల తర్వాత, శాస్త్రవేత్తలు ఇక్కడ దాగిఉన్న రహస్యాన్ని ఛేదించారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ఆలయం కింద నుండి విషపూరిత కార్బన్ డయాక్సైడ్ వాయువు నిరంతరం లీక్ అవుతుందని.. ఇది మానవులను, జంతువులు, పక్షులను తాకిన వెంటనే చంపేస్తుంది. కేవలం 10 శాతం కార్బన్ డయాక్సైడ్ వాయువు..  ఏ వ్యక్తినైనా 30 నిమిషాల్లో నిద్రపోయేలా చేయగలదు. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలోని గుహలో కార్బన్ డయాక్సైడ్ వంటి విష వాయువు పరిమాణం 91 శాతం ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యధిక పరిమాణంలో ఉన్న ఈ వాయువు విషంగా మారి ఆలయ సమీపంలోకి వెళ్లినవారిని ప్రాణాలను హరిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆలయం లోపలి నుండి బయటకు వచ్చే విష వాయువు కారణంగా ఇక్కడకు వచ్చే కీటకాలు, జంతువులు, పక్షులు చనిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి

హెరాపోలిస్ నగరం ఒక పీఠభూమిలో ఉన్న పురాతన రోమన్ నగరం. ఈ చిన్న ప్రదేశంలో చాలా వైవిధ్యాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ప్రాంతంలో వేడి నీటి బుగ్గలు, వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ వాయు ప్రభావంతో నీటి బుడగలు నిరంతరం పెరుగుతాయి. ఈ నగరం రెండవ శతాబ్దంలోనే థర్మల్ స్పాగా ప్రసిద్ధి చెందింది. మీడియా కథనాల ప్రకారం.. వారి వ్యాధుల చికిత్స కోసం దూరప్రాంతాల నుండి ప్రజలు నగరానికి వచ్చేవారు. ముఖ్యంగా ఇక్కడి వేడి నీటి బుగ్గలు కీళ్లు, చర్మానికి సంబంధించిన వ్యాధులను నయం చేయడంలో చాలా ప్రసిద్ధి చెందాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!