ఈ ఆలయంలోని వింత సైన్స్ కి సవాల్ .. ఆ సమయంలో నిద్రిస్తే మనుషులను శిలలుగా మార్చే దేవాలయం.. ఎక్కడంటే..
ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైతే బస చేస్తారో వారు శిలారూపంగా మారతారని ప్రజల నమ్మకం. అయితే.. ప్రజల నమ్మకం నిజామా కదా.. ఆలయం వెనుక ఉన్న నిజం ఏమిటి.. ఆలయం వెనుక ఉన్న మిస్టరీ నేటికీ ఛేదించబడలేదు. మరి మనిషిని రాయిగా మార్చే ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం…
భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. ప్రకృతిలో ఆలయాల్లో ఎన్నో రహస్యాలు, వింతలు, విశేషాలు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని మనవ మేథస్సు, సైన్స్ కూడా చెందించలేదు. అంబరాన్ని తాకుతున్న మనిషి కొన్ని దేవాలయాల్లోని రహస్యాలు నేటికీ వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఎన్నో రహస్యాలు, వింతలను దాచుకున్న ఆలయం గురించి తెలుసుకుందాం.. ఈ ఆలయం గురించి కథ చాలా షాకింగ్ గా ఉంటుంది. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ ఉండరని చెబుతారు. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైతే బస చేస్తారో వారు శిలారూపంగా మారతారని ప్రజల నమ్మకం. అయితే.. ప్రజల నమ్మకం నిజామా కదా.. ఆలయం వెనుక ఉన్న నిజం ఏమిటి.. ఆలయం వెనుక ఉన్న మిస్టరీ నేటికీ ఛేదించబడలేదు. మరి మనిషిని రాయిగా మార్చే ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం…
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని ‘కిరాడు ఆలయం‘గా ప్రజలు పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలిని పోలి ఉంటుంది. అందమైన శిల్పాలు ఆకట్టుకునే నిర్మాణంతో ఉన్న ఈ ఆలయాన్ని రాజస్థాన్ ఖజురహో అని కూడా పిలుస్తారు. ఒక నివేదిక ప్రకారం, క్రీ.పూ.1161లో ఈ ప్రదేశం పేరు ‘కిరాత్ కూప్’. ఇది ఐదు దేవాలయాల సమూహం. ఇప్పుడు ఇక్కడ చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శివాలయం, విష్ణు దేవాలయం పరిస్థితి బాగానే ఉంది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రజల్లో భిన్న కథనాలు వినిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ జరిగిన ఘటనతో ప్రజలు భయపడిపోయారు. అప్పటి భయం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది.
‘ఆసక్తికరమైన కథ’ చాలా 8 వందల సంవత్సరాల క్రితం ఒక మహర్షి తన శిష్యులతో కలిసి దేశ సంచారంలో భాగంగా ఈ ఆలయానికి చేరుకున్నాడని చెబుతారు. ఒకరోజు ఆయన శిష్యులను గుడిలో విడిచిపెట్టి తీర్ధ సందర్శనార్ధం వెళ్ళాడు. ఈ క్రమంలో ఒక శిష్యుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. సన్యాసి ఇతర శిష్యులు గ్రామస్తుల నుండి సహాయం కోరారు.. అయితే ఎవరూ వారికి సహాయం చేయలేదు. అయితే శిష్యులకు ఒక మహిళ సహాయం చేసిందని కూడా చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న సన్యాసికి కోపం వచ్చి, సాయంత్రం తర్వాత ప్రజలంతా రాళ్లుగా మారతారని గ్రామస్తులను శపించాడు. అంతేకాదు తన శిష్యులకు సహాయం చేసిన స్త్రీని సాయంత్రానికి ముందే ఊరు విడిచిపెట్టి వెళ్లిపొమ్మని.. వెనుతిరిగి చూడవద్దని చెప్పాడు. అయితే ఆ మహిళ ఊరు విడిచి వెళ్లే సమయంలో ఏమి జరుగుతుందా అనే ఆసక్తితో వెనక్కి తిరిగి చూడటం ప్రారంభించింది, ఫలితంగా ఆమె కూడా రాయి అయింది. ఆ స్త్రీ విగ్రహం ఇప్పటికీ అక్కడ కనిపిస్తుంది. అప్పటి నుండి నేటి వరకు ఈ విషయంపై ప్రజలు భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు ఈ కిరాడు ఆలయంలో ఎవరూ ఉండరు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..