Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: పక్షుల జీవితం నుంచి మనిషి ఈ లక్షణాలు నేర్చుకుంటే సక్సెస్ మీ సొంతం అంటున్న చాణక్య

ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోని ఉత్తమ పండితులలో ఒకరుగా కీర్తిగాంచారు. ప్రతి వ్యక్తి జీవితంలో పక్షుల నుంచి విజయ రహస్యాలను నేర్చుకోవచ్చు అని తెలిపారు.

Chanakya Niti: పక్షుల జీవితం నుంచి మనిషి ఈ లక్షణాలు నేర్చుకుంటే సక్సెస్ మీ సొంతం అంటున్న చాణక్య
Chanakya Neeti
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2022 | 10:37 AM

జీవితంలో ఏ విధంగా విజయం సాధించవచ్చో ఆచార్య చాణక్యుడు తన విధానాల ద్వారా చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం, ఒక చిన్న చీమ నుంచి కూడా ఒక వ్యక్తి తన జీవితంలోని అనేక ముఖ్య పాఠాలను నేర్చుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన వక్త మాత్రమే కాదు.. అదే సమయంలో చాణుక్యుడు చెప్పిన విషయాలు నేటి యుగంలో కూడా ఆచరణనీయమని పెద్దలు చెబుతున్నారు.ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోని ఉత్తమ పండితులలో ఒకరుగా కీర్తిగాంచారు. ప్రతి వ్యక్తి జీవితంలో పక్షుల నుంచి విజయ రహస్యాలను నేర్చుకోవచ్చు అని తెలిపారు. ఈరోజు చాణక్యుడు చెప్పిన ఆ విషయాలనుగురించి నేడు తెలుసుకుందాం..

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి విజయాన్ని సాధించడానికి కొంగ గుణాలు ఎక్కువగా ఉపయోగపడతాయని చెబుతున్నాడు. కొంగ తన ఇంద్రియాలన్నింటినీ బాగా నియంత్రిస్తుంది. విజయం కోసం ఇంద్రియాలను నియంత్రించడం చాలా ముఖ్యం అని చాణక్యుడు చెప్పాడు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి మనస్సు కలత చెందుతుంది. ఏకాగ్రత ఉంచడం వలన విజయావకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి.

ఆచార్య చాణక్య ఒక వ్యక్తి ప్రవర్తన ప్రసంగం ద్వారా తెలుస్తుంది. కోకిల మాట ఎలా తీయగా ఉంటుందో..  అదే విధంగా మంచి మాటలు మాట్లాడనివాడు మౌనంగా ఉండాలని చాణుక్యుడు చెప్పాడు. ఎందుకంటే మనిషి మధురంగా మాట్లాడితే.. శత్రువు కూడా స్నేహితుడు అవుతాడు. అందుకే తక్కువ మాట్లాడినా తీయగా మాట్లాడండి.

ఇవి కూడా చదవండి

సోమరితనం మనిషికి శత్రువు వంటిదని చాణక్య విధానంలో చెప్పబడింది. అందుకే సూర్యోదయానికి ముందే లేచే గుణాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోడి నుంచి నేర్చుకోవాలి. అదే సమయంలో.. తన ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటుంది. తన పిల్లలకు పెట్టి తాను తర్వాత తింటుంది. అంతేకాదు తన కంటే బలమైన ప్రత్యర్థులతో బలంగా పోటీపడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)