Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips For Venus: దంపతుల మధ్య వివాదాలా.. శుక్రవారం లక్ష్మీదేవిని, శుక్రుడిని ఇలా పూజించి చూడండి..

ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో.. వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే శుక్ర స్తానం బలహీనంగా ఉన్నప్పుడు.. దంపతుల మధ్య అనేక సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది. శుక్రవారం నాడు నిర్వహించే ప్రత్యేక పూజలు, నియమాలు..

Astro Tips For Venus: దంపతుల మధ్య వివాదాలా.. శుక్రవారం లక్ష్మీదేవిని, శుక్రుడిని ఇలా పూజించి చూడండి..
Easy Astro Tips For Venus
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2022 | 9:30 PM

హిందూమతంలో దేవతారాధనకు ప్రముఖ స్థానం ఉంది. రోజుకొక దేవీదేవతలకు ప్రాముఖ్యతనిస్తూ.. ఆయా రోజుల్లో పూజిస్తారు. ఇలా చేయడం అత్యంత పవిత్రం.. ఫలవంతం అని నమ్మకం. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజుని సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వలన కోరుకున్న ఫలితాలు లభిస్తాయని నమ్మకం. లక్ష్మీదేవిని నియమాలు, నిబంధనల ప్రకారం పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని.. ధన ధాన్యాలకు లోటు ఉండదని విశ్వాసం. శుక్రవారము వ్రతము ఆచరించిన వారి జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  శుక్రవారం నాడు శుక్రుడిని పూజించడం చాలా శుభప్రదంగా..  ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో.. వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే శుక్ర స్తానం బలహీనంగా ఉన్నప్పుడు.. దంపతుల మధ్య అనేక సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది. శుక్రవారం నాడు నిర్వహించే ప్రత్యేక పూజలు, నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.

  1. మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే.. శుక్రవారం రోజున లక్ష్మిదేవికి పసుపు, కుంకుమ, గాజులు వంటి 16 రకాల  వస్తువులను సమర్పించండి. లక్ష్మిదేవికి ఎర్రటి కుంకుమ, గాజులు, ఎర్రటి వస్త్రం, పువ్వులు వంటివి సమర్పించడం ద్వారా అమ్మ అనుగ్రహిస్తుంది. తన భక్తులను ఆశీర్వదిస్తుందని విశ్వాసం.
  2. ఎవరి జాతకంలోనైనా శుక్ర దోషం ఉన్నట్లయితే.. శుక్రవారం లేదా మరే రోజు పొరపాటున కూడా కాలిన, చిరిగిన లేదా మురికి బట్టలు ధరించవద్దు. శుక్రుడు అనుగ్రహం కోసం ఎల్లప్పుడూ ఉతికి, శుభ్రం చేసిన దుస్తులను మాత్రమే ధరించండి. వీలైతే శుక్రవారం తెల్లటి దుస్తులు ధరించండి.
  3. ఇవి కూడా చదవండి
  4. జాతకంలో శుక్ర గ్రహం శుభ ద్రుష్టి, అనుగ్రహం కోసం ఆ వ్యక్తి ప్రతిరోజూ శ్రీ సూక్త, లక్ష్మీ సూక్త , లక్ష్మి కవచాన్ని జపించండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. భక్తుల కష్టాలన్నింటినీ దూరం చేస్తుందని నమ్మకం.
  5. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి తామర పువ్వును సమర్పించాలి. తామరపువ్వు లక్ష్మిదేవికి ఎంతో ప్రీతికరమైనదని.. ఈ పుష్పాన్ని తనకు  సమర్పించే భక్తునిపై సదా అనుగ్రహం కురిపిస్తుందని విశ్వాసం. శుక్రవారం రోజున చేసే ఈ పూజా విధానం వల్ల మనిషి జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి.
  6. లక్ష్మీదేవిని పూజించిన తర్వాత.. హారతి ఇచ్చే సమయంలో తప్పనిసరిగా నాలుగు కర్పూరం బిళ్ళతో పటు 2 లవంగాలను ప్లేట్‌లో ఉంచాలి. ఇలా ఆహాతి ఇచ్చి పరిహారాన్ని ఆచరిస్తే.. లక్ష్మీదేవి సంతోషిస్తుంది..  కోరుకున్న వరం ఇస్తుంది అని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)