AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shaniswara: శనివారం ఈ రాశులవారు పొరపాటున కూడా శనిదానం చేయవద్దు.. లేదంటే కష్టాలు తప్పవు..

ప్రతి ఒక్కరూ శనివారం ఇలా శనివారం దానం చేయడం సరైనది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. శనివారం నాడు ఎవరు దానం చేయాలి? ఎవరు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

Lord Shaniswara: శనివారం ఈ రాశులవారు పొరపాటున కూడా శనిదానం చేయవద్దు.. లేదంటే కష్టాలు తప్పవు..
Lord Shaniswara
Surya Kala
|

Updated on: Dec 02, 2022 | 5:50 PM

Share

శనీశ్వరుడి పేరు వింటే చాలు జనం భయపడిపోతారు. తమ పై శనిప్రభావం పడకూడని భావిస్తారు.  శనీశ్వరుడు కర్మ ప్రదాత. న్యాయానికి ప్రతీక. శనీశ్వరుడు మంచిపనులు చేసేవారికి శుభఫలితాలను, చెడ్డపనులు చేసేవారికి చెడు ఫలితాలను ఇస్తాడు. శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. అన్ని గ్రహాల కంటే అతి నెమ్మదిగా కదిలే గ్రహం శనీశ్వరుడు. అందుకనే శని ప్రభావం అది శుభమైనా, అశుభమైనా ప్రజల జీవితంపై ఎక్కువ కాలం పాటు ఉంటాయి.

శని రెండున్నరేళ్లకు తన రాశిని మార్చుకుంటాడు. శనీశ్వరుడు చెడు ప్రభావాలను నివారించడానికి ప్రజలు తరచుగా శనికి సంబంధించిన వస్తువులను శనివారం నాడు దానం చేస్తారు. ఇలా శనివారం దానం చేయడం వల్ల శనీశ్వరుడి అశుభ దృష్టి ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ఆయితే ప్రతి ఒక్కరూ శనివారం ఇలా శనివారం దానం చేయడం సరైనది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. శనివారం నాడు ఎవరు దానం చేయాలి? ఎవరు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

దానం ఎవరికి ఎలా చేయాలంటే? శనీశ్వరుడు దృష్టి పడకుండా.. దుష్ఫలితాలు రాకుండా ఉండాలంటే సమాజంలో అట్టడుగున ఉన్న పేదలకు, నిస్సహాయులకు దానధర్మాలు చేయాలి. తమకంటే బలహీనంగా ఉన్నవారికి సహాయం చేసే వ్యక్తుల పట్ల శని దేవుడు అనుగ్రహం లభిస్తుందని ఒక నమ్మకం. శనిదానాన్ని ఎల్లప్పుడూ సూర్యాస్తమయం తర్వాత మాత్రమే చేయాలి. దానం చేసే ముందు శనికి సంబంధించిన మంత్రాలను తప్పనిసరిగా జపించాలి.

ఇవి కూడా చదవండి

ఏ రాశుల వారు శని దానం చేయకూడదంటే? వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వృషభం, కన్య, తుల, మకర రాశుల వారు శనివారం శని దానం చేయకూడదు. అంతే కాకుండా ఎవరి జాతకంలో శని శుభ స్థానములో, మంచి స్థానంలో ఉన్నాడో వారు కూడా శని దానం చేయకూడదు. మరోవైపు.. రోజువారీ జీవితంలో ఇనుము, బొగ్గు, ద్రవ పదార్థాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా శని దానం చేయడం మానుకోవాలి. శని దానం మనస్సు లేకుండా చేయరాదు. లేదంటే ఫలితం తారుమారవుతుంది. శనిగ్రహ ప్రభావం ఉన్నప్పుడు శని దానం చేయడం మంచిది కాదని నమ్మకం.

శని దానం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటంటే? తరచుగా ఏదో ఒక వ్యాధితో బాధపడేవారు శనివారం నాడు నీడ పాత్ర దానం చేయాలి. నీడను దానం చేయడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. మీరు ఆర్థికంగా బలహీనంగా ఉన్నట్లయితే..  శనివారం నాడు పేదలకు నల్ల బట్టలు దానం చేయడం శుభప్రదం. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే శనివారం రోజు నల్ల నువ్వులు, ఉసిరి పప్పు వంటివి దానం చేయండి. నిరుద్యోగ సమస్యను నివారించడానికి.. శనివారం ఇనుము వస్తువులను దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)