Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Worship Rules: ఇంట్లో పూజ చేసే సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు మీకోసం..

జీవితంలో కోరిన కోర్కెలు నెరవేరడం కోసం, బాధలు తీరడం కోసం  తప్పనిసరిగా దేవునికి సంబంధించిన పూజా నియమాల గురించి తెలుసుకోవాలి. అనుసరించాలి. ఇలా చేయడం వలన మీరు దేవతల ఆశీస్సులు పొందుతారు.

Hindu Worship Rules: ఇంట్లో పూజ చేసే సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు మీకోసం..
Hindu Worship Rules
Follow us
Surya Kala

|

Updated on: Dec 01, 2022 | 6:08 PM

హిందూ సంప్రదాయంలో దైవారాధనకు ప్రముఖ స్థానం ఉంది. ఇంట్లో పూజా గదిని ఏర్పాటు చేసుకుని తమకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తారు. మరికొందరు దేవాలయానికి వెళ్లి పూజలను చేస్తారు. అయితే  చాలా మంది తాము దేవుడికి ఎన్ని పూజలు చేసినా.. తమపై అనుగ్రహం కలగడం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే  జీవితంలో కోరిన కోర్కెలు నెరవేరడం కోసం, బాధలు తీరడం కోసం  తప్పనిసరిగా దేవునికి సంబంధించిన పూజా నియమాల గురించి తెలుసుకోవాలి. అనుసరించాలి. ఇలా చేయడం వలన మీరు దేవతల ఆశీస్సులు పొందుతారు. హిందూ మతంలో భగవంతుని ఆరాధనకు సంబంధించిన అన్ని ముఖ్యమైన నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.

  1. భగవంతుని ఆరాధనను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో, తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ భక్తి, విశ్వాసంతో అంకితభావంతో పూజను చేయాలి.
  2. హిందూ మత విశ్వాసం ప్రకారం.. పూజా చేయడానికి మొదటి నియమం ఏమిటంటే, గణపతిని ఆరాధించడం. ఇలా చేయడం వలన చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణంగా, విజయవంతమవుతాయి.
  3. సనాతన సంప్రదాయం ప్రకారం..  నల్లని వస్త్రాలు ధరించి ఏ దైవానికి పూజ చేయకూడదు. నల్లని దుస్తులు ధరించడం వల్ల మనసులో ప్రతికూల భావాలు వస్తాయని నమ్ముతారు.
  4. హిందూ మతంలో, దేవుని పూజలో దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదాహరణకు, విరిగిన దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. అలాగే పూజ చేసేటప్పుడు దీపాన్ని ఒకదానితో ఒకటి కలిపి వెలిగించకూడదు. నూనె, నెయ్యి దీపాలను పొరపాటున కూడా కలిపి వెలిగించకూడదు.
  5. ఇవి కూడా చదవండి
  6. తులసి దళాన్ని ఎల్లప్పుడూ విష్ణువు, శ్రీ కృష్ణుడు, హనుమంతుడికి నైవేద్యం సమర్పణ సమయంలో అర్పించాలి. అయితే తులసి దళాన్ని సాయంత్రం, ఆదివారం, మంగళవారం, ఏకాదశిలలో ఎప్పుడూ పచెట్టునుంచి కోయకూడదు. అటువంటి పరిస్థితిలో..  తులసి దళాన్ని ఒక రోజు ముందు తెంచుకుని ఉంచుకోవాలి.
  7. గుడిలో గానీ, ఇంట్లో గానీ పూజలు చేసేటప్పుడు దేవుడికి ప్రదక్షిణలు చేయకూడదు. శివుడుకి అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి.   ప్రదక్షిణలో సగం చేసిన తర్వాత..  తిరిగి రావాలి.
  8. హనుమంతుడిని పూజించేటప్పుడు, మహిళలు ఆయన విగ్రహాన్ని అస్సలు తాకకూడదు. స్త్రీలు హనుమంతుడికి పూజారి లేదా పురుషుల ద్వారా సింధూరాన్ని సమర్పించాలి.
  9. హిందూ విశ్వాసం ప్రకారం, రాత్రిపూట దేవుడిని పూజించేటప్పుడు, పూజలో గంటలు, శంఖం వాయించకూడదు.
  10. మత విశ్వాసం ప్రకారం, ఇంట్లో లేదా ఆలయంలో సాయంత్రం పూజ చేసిన తర్వాత, ప్రార్థనా స్థలంపై ఒక తెరను వేయాలి. ఉదయం స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత, దేవుని పూజ సమయంలో ఆ తెరను తొలగించాలి.
  11. భగవంతుని ఆరాధన సంపూర్ణ ఫలం పొందడానికి, ఎల్లప్పుడూ పూర్తి భక్తితో ..  విశ్వాసంతో అంకితభావంతో పూజించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)