అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించిన సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 10న డబ్బు డ్రా చేసే వ్యక్తిలా నటించి, తలుపులు పగలగొట్టే ప్రయత్నంలో అలారం మోగింది. దీంతో నిందితుడు పారిపోయినా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు భద్రతతో భారీ దోపిడీ తప్పింది.