AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Luckiest Zodiac Sign 2023: కొత్త ఏడాదిలో ఈ 5 రాశుల వ్యక్తులు అదృష్టవంతులట.. డబ్బు, సుఖం, సంతోషం అన్నీ వీరిసొంతమట.. అందులో మీరున్నారా..

ప్రేమికుల జీవితంలో, వైవాహికుల జీవితంలోనూ ఆనందం ఉంటుంది. పెళ్లికాని యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీంతో 2023లో అత్యంత అదృష్ట రాశులుగా ఈ ఐదు రాశులు నిలుస్తాయని చెప్పవచ్చు. 2023లో అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Luckiest Zodiac Sign 2023: కొత్త ఏడాదిలో ఈ 5 రాశుల వ్యక్తులు అదృష్టవంతులట.. డబ్బు, సుఖం, సంతోషం అన్నీ వీరిసొంతమట.. అందులో మీరున్నారా..
Zodiac Sign
Surya Kala
|

Updated on: Nov 29, 2022 | 4:23 PM

Share

కొత్త సంవత్సరం 2023కి త్వరలో వెల్కమ్ చెప్పబోతున్నాం. కొత్త ఏడాది కొన్ని రాశులవారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రేమ, విద్య , ఆర్థిక జీవితం కొత్త ఏడాదిలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం 5 రాశుల వారికి చాలా విజయాలను తీసుకొస్తుందట. కొత్త సంవత్సరంలో ఈ 5 రాశుల వారికి పురోభివృద్ధి, ధనప్రాప్తి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. అంతేకాదు.. ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. అంతేకాదు.. ప్రేమికుల జీవితంలో, వైవాహికుల జీవితంలోనూ ఆనందం ఉంటుంది. పెళ్లికాని యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీంతో 2023లో అత్యంత అదృష్ట రాశులుగా ఈ ఐదు రాశులు నిలుస్తాయని చెప్పవచ్చు. 2023లో అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి: ఈ రాశి వారికి 2023 సంవత్సరం చాలా బాగుంటుంది. జనవరి ప్రారంభంలో ఈ రాశి వ్యక్తులు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అంతేకాదు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పురోగతిని జనవరి 2023లో పొందుతారు. కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితిలో గొప్ప పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో కూడా అధిక లాభం పొందుతారు. వివాహం కావాల్సిన వారికి వివాహం అవుతుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. కొత్త ఆస్తిని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

సింహ రాశి: ఈ రాశివారికి 2023 ప్రారంభం నుండి.. ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. శని సంచారం ఈ రాశి వ్యక్తుల జీవితంలో  సానుకూలతతో నింపుతుంది. కొత్త ఏడాది  కొన్ని గొప్ప విజయాలతో ప్రారంభం అవుతుంది. ప్రతి పనిలో అదృష్టం వీరి వెంట  ఉంటుంది. జీతం పెరిగే అవకాశం ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఏప్రిల్ అద్భుతమైన సమయం.

ఇవి కూడా చదవండి

తుల రాశి: ఈ రాశి వారికీ 2023లో మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అయితే మొత్తానికి సంవత్సరం సంతోషముగానే సాగుతుందని చెప్పవచ్చు. ఏడాది ప్రారంభంలో మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడికి అనుకూలమైన సమయం. అయితే, ఏడాది ద్వితీయార్థంలో మాత్రం ఆర్ధిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడులు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి: ఈ రాశివారికి 2023 సంవత్సరం మొత్తంగా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఏడాదిలో ఆర్ధిక పురోభివృద్ధి, డబ్బు, ఆనందం, ప్రతిదీ సొంతమవుతుంది. ముఖ్యంగా సంవత్సరంలో మొదటి మూడు నెలలు చాలా శుభప్రదంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. 2023 సంవత్సరంలో ఉద్యోగస్థులకు, వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి: ఈ రాశివారు డబ్బు పరంగా..  2023 లో ఇబ్బందులు ఏర్పడినా.. చివరికి లాభపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాలను చక్కగా అదుపులో పెట్టుకుంటే.. భారీగా డబ్బులను ఆదా చేస్తారు. షేర్ మార్కెట్ నుంచి కూడా ఆదాయం లభిస్తుంది. కెరీర్‌కి కూడా సమయం అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విహారయాత్రకు వెళ్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోనుంది!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోనుంది!
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది