AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rudraksha Mala: మీరు రుద్రాక్షలను ధరిస్తున్నారా.. అయితే ఈ తప్పులు చేయవద్దు..

రుద్రాక్ష చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతుంది. కనుక వీటిని ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఎవరైనా రుద్రాక్షలను ధరించే ముందు నియమాలను పాటించకపోతే.. అప్పుడు ఏర్పడే పరిణామాలు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. రుద్రాక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం.

Rudraksha Mala: మీరు రుద్రాక్షలను ధరిస్తున్నారా.. అయితే ఈ తప్పులు చేయవద్దు..
Benefits Of Rudrakshas
Surya Kala
|

Updated on: Nov 28, 2022 | 3:27 PM

Share

లయకారుడైన శివయ్యకు రుద్రాక్ష ప్రీతికరమైనదని హిందూ మతంలో నమ్ముతారు. రుద్రాక్షలను లయకారుడికి ప్రతిరూపంగా భావించి వాటిని ధరిస్తారు. మహాదేవుని అనుగ్రహం పొందడానికి..  రుద్రాక్ష సమర్పిస్తే ప్రతి పని విజయవంతమవుతుంది. రుద్రాక్షను ధరించడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుందని విశ్వాసం. రుద్రాక్ష వివిధ పరిమాణాలను కలిగి ఉంటాయి. వీటి అతీంద్రియ స్వభావం కూడా భిన్నంగా ఉంటుంది. రుద్రాక్ష చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతుంది. కనుక వీటిని ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఎవరైనా రుద్రాక్షలను ధరించే ముందు నియమాలను పాటించకపోతే.. అప్పుడు ఏర్పడే పరిణామాలు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. రుద్రాక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం.

నిద్రపోయే ముందు రుద్రాక్షను తీసివేయండి..  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నిద్రపోయే ముందు రుద్రాక్షను తీసివేయాలి. రుద్రాక్ష ధరించి నిద్రిస్తే అపవిత్రం అవుతుందని నమ్ముతారు. అంతేకాదు  నిద్రపోయేటప్పుడు రుద్రాక్ష విరగుతుందనే భయం ఉంటుంది కాబట్టి పడుకునే ముందు తీసేయాలని నియమం ఉంది. మళ్లీ ఉదయం స్నానం చేసిన తర్వాతే రుద్రాక్షను ధరించాలి.

రుద్రాక్ష ధరించేవారు మాంసం, మద్యం సేవించరాదు..  రుద్రాక్ష చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మాంసం, మద్యం సేవించే సమయంలో రుద్రాక్షను ధరించకూడదు. రుద్రాక్ష శివుని ప్రసాదం అని నమ్ముతారు.. దీనిని పవిత్రతను కాపాడే విధంగా నియమాలను పాటించాలి. లేదంటే వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

శిశువు జన్మించిన వెంటనే రుద్రాక్షను వేయవద్దు..   హిందూమతంలో నవజాత శిశువు పుట్టిన తరువాత.. ఒక దారం కడతారు. అయితే..శిశువు జన్మించిన తర్వాత కొన్ని రోజులు మైల రోజులు.. కనుక  బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ కు లేదా తల్లి రుద్రాక్షను వేయవద్దు.

రాశి ప్రకారం రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. సుఖ సంతోషాలు, అదృష్టం, కోరిన కోరికలు నెరవేరడానికి ఎల్లప్పుడూ రాశిని అనుసరించి రుద్రాక్షను ధరించాలి.  12 రాశుల వారికి ఏ రుద్రాక్ష శుభప్రదమో తెలుసుకుందాం.

మేష రాశి – ఏక ముఖి, మూడు ముఖాలు లేదా పంచ ముఖి రుద్రాక్ష

వృషభ రాశి – నాలుగు ముఖాలు, ఆరు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాలు రుద్రాక్ష

మిధున రాశి  – నాలుగు ముఖాలు, ఐదు ముఖాలు లేదా పదమూడు ముఖాల రుద్రాక్ష

కర్కాటక రాశి  – మూడు ముఖాలు, ఐదు ముఖాలు లేదా గౌరీ-శంకర రుద్రాక్ష

సింహ రాశి  – ఏక  ముఖి, మూడు ముఖాలు లేదా ఐదు ముఖాలు రుద్రాక్ష

కన్య రాశి  – నాలుగు ముఖాలు, ఐదు ముఖాలు లేదా పదమూడు ముఖాలు

తుల రాశి – నాలుగు ముఖాలు, ఆరు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్ష

వృశ్చిక రాశి  – మూడు ముఖాలు, ఐదు ముఖాలు లేదా గౌరీ-శంకర రుద్రాక్ష

ధనుస్సు రాశి  – ఏక  ముఖి, మూడు ముఖాలు లేదా ఐదు ముఖాల రుద్రాక్ష

మకర రాశి  – నాలుగు ముఖాలు, ఆరు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్ష

కుంభ రాశి  – నాలుగు ముఖాలు, ఆరు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాల రుద్రాక్ష

మీన రాశి  – మూడు ముఖాలు, ఐదు ముఖాలు లేదా గౌరీ-శంకర రుద్రాక్ష

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)