AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం.. లింగం చుట్టూ పాము ప్రదక్షిణలు.. శివనామ స్మరణతో మార్మోగిన ఆలయం.

తరచుగా పాములు శివాలయాల్లోకి వెళ్లి..  దర్శినమిచ్చిన వీడియోలు సర్వసాధారణంగా సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ భారీ నాగుపాము ఓ ఆలయంలో ప్రత్యక్షం అయింది. ఈ ఘటన తెలంగాణ లోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 

Telangana: శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం.. లింగం చుట్టూ పాము ప్రదక్షిణలు.. శివనామ స్మరణతో మార్మోగిన ఆలయం.
Snake On The Shiva Lingam
Surya Kala
|

Updated on: Nov 27, 2022 | 10:13 AM

Share

ప్రకృతిని దైవంగా నమ్మి కొలిచే సంస్కృతి హిందువులది. సమస్త విశ్వం దైవశక్తులతో నిండిపోయిందని హిందూ సనాతన ధర్మం చెప్తోంది. మనిషిలో మాత్రమే కాదు.. పశు పక్షులు, జంతువులు,. పాములు ఇలా సమస్త జీవరాశిలో దైవాన్ని చూసే నేచర్ మనది. కుక్క,ఆవు, నాగుపాము, కాకి ఇలా అనేక జంతువులను, పక్షులను దైవంగా భావించి పూజిస్తాం. పాములకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏడూ లోకాల్లో ఒకటి నాగలోకం.. అమృతం కోసం పాలకడలిని చిలికిన సమయంలో వాసుకి అనే సర్పం తాడుగా ఏర్పడింది..  శివయ్య  మెడలో కంఠాభరణం నాగుపాము, శ్రీ విష్ణువు పాన్పు ఆదిశేషుడు ఇలా  పాముల గురించి పురాణాల్లో రకరకాల కథలు ప్రస్తావనలో ఉన్నాయి. శ్రీకాళహస్తి క్షేత్రంలో భోళాశంకరుడి పూజను చేసింది పాము..అయితే తరచుగా పాములు శివాలయాల్లోకి వెళ్లి..  దర్శినమిచ్చిన వీడియోలు సర్వసాధారణంగా సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ భారీ నాగుపాము ఓ ఆలయంలో ప్రత్యక్షం అయింది. ఈ ఘటన తెలంగాణ లోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

కామారెడ్డి జిల్లా.. దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఇక్కడ శివయ్య తనయుడు సుబ్రహ్మణ్య స్వామితో పాటు అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. శివయ్య కూడా భక్తులతో పూజలను అందుకుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా శివాలయంలోని గర్భాలయంలో నాగుపాము ప్రత్యక్షం. లింగాన్ని చుట్టుకుని కొంచెం సేపు ఉన్న పాము.. అనంతరం లింగం చుట్టూ సుమారు గంట పాటు నాగుపాము ప్రదక్షిణలు చేసింది.  దీంతో ఈ వింతను చూడడానికి శివయ్యను దర్శించుకోవడానికి భారీగా భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. శివనామ స్మరణంతో ఆలయ ప్రాంతం మార్మోగిపోయింది. అనంతరం పాముని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని సమీపంలో దట్టమైన ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..