Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమల్లో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 40 గంటల సమయం..

ప్రస్తుతం కొండల రాయుడిని దర్శించుకోవడానికి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతుంది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమల్లో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 40 గంటల సమయం..
Tirumala Queue Lines
Follow us

|

Updated on: Nov 27, 2022 | 8:36 AM

ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ విదేశాల నుంచి సామాన్యులు, సెలబ్రెటీలు తిరుమలకొండకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం కొండల రాయుడిని దర్శించుకోవడానికి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా.. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మరోవైపు కొండమీద భక్తులు వసతి కోసం అవస్థలు పడుతున్నారు. గదులు ఖాళీ లేకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కొండపై ఉన్న యాత్రికుల వసతి సముదాయాలన్నీ భక్తులతో నిండిపోయాయి.

వెంకన్నకు ప్రీతికరమైన శనివారం ( 26-11-2022 )రోజున శ్రీవారిని 76,681 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,109 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఒక్కరోజులో రూ.3.38 కోట్ల శ్రీవారి హుండీ ఆదాయం లభించింది. 29,037 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. \

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Latest Articles