‘సంగీత్’లో విజయ్ దేవరకొండ మెడలో వేసుకున్న పచ్చల హారం ధర తెలిస్తే షాక్.. నెట్టింట ఫోటోలు వైరల్
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ వివాహ బంధంతో ఒక్కటైన వేళ, ఆ వేడుకలకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. నిన్నటి వరకు సాంప్రదాయక కట్టుబొట్టుతో అలరించిన ఈ జంట, ఇప్పుడు తమ ‘సంగీత్’ వేడుకలో రాయల్ లుక్‌తో మెరిసిపోయారు.

ముఖ్యంగా వరుడు ధరించిన ఆభరణాలు, ఆ జంట వేసిన స్టెప్పులు చూస్తుంటే కళ్లు తిప్పుకోవడం ఎవరికైనా సాధ్యం కాదనే చెప్పాలి. ఆమె నేషనల్ క్రష్.. ఆయన రౌడీ స్టార్. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి ఎన్ని మార్కులు పడ్డాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్నాళ్లుగా వీరి పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు 2026 ఫిబ్రవరి నెల ఒక మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది. కొడవ మరియు తెలుగు సంప్రదాయాల ప్రకారం ఒక్కటైన ఈ జంట, ఇప్పుడు తమ సంగీత్ వేడుక ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సాధారణంగా పెళ్లిలో పెళ్లికూతురు నగలే హైలైట్ అవుతాయి, కానీ ఇక్కడ పెళ్లికొడుకు ధరించిన ఒక ప్రత్యేకమైన హారం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ కొత్త జంట మరెవరో కాదు.. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న.
రాకుమారుడిలా రౌడీ హీరో
సంగీత్ వేడుకలో విజయ్ దేవరకొండ పక్కా రాయల్ లుక్‌లో దర్శనమిచ్చారు. ముదురు నీలం రంగులో ఉన్న కుర్తా-పైజామా సెట్‌కు తోడుగా భారీ ఎంబ్రాయిడరీ ఉన్న కోటును ధరించారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆయన మెడలోని ప్రత్యేకమైన వజ్రాలు పొదిగిన పచ్చల నెక్లెస్. ఈ నెక్లెస్ మధ్యలో ఉన్న భారీ పచ్చ లాకెట్టు, దానిపై ఉన్న పెద్ద డైమండ్ క్యాప్ ఆయనకు ఒక రాకుమారుడి హుందాతనాన్ని తెచ్చిపెట్టాయి. పురుషుల ఫ్యాషన్ లో ఇదొక కొత్త ట్రెండ్ కు నాంది పలికిందని చెప్పాలి.
డైమండ్ ఆభరణాల్లో రష్మిక
ఇక రష్మిక ఎప్పటిలాగే తన చిరునవ్వుతో, వెండి రంగు లెహంగాలో దేవకన్యలా మెరిసిపోయారు. ఫల్గుణి షేన్ పీకాక్ డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో ఈ జంట నాట్య మయూరాల్లా విన్యాసాలు చేస్తూ కెమెరాకు చిక్కారు. రష్మిక తన లుక్ కు తగ్గట్టుగా ఖరీదైన డైమండ్ ఆభరణాలను ఎంచుకున్నారు. విజయ్ వేలికి ఉన్న 16 రాళ్ల డైమండ్ రింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేమకు చిహ్నంగా బ్రాండ్ క్రిస్‌క్రాస్ X మోటిఫ్ ఉన్న ఈ ఉంగరం ధర సుమారు రూ. 15 లక్షలు ఉంటుందని సమాచారం.
వ్రతం నుంచి సంగీత్ వరకు..
ఫిబ్రవరి 26, 2026న వివాహం జరిగిన తర్వాత, ఈ జంట తమ సొంత ఊరిలో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించుకున్నారు. ఆ వేడుక ముగియగానే ఇప్పుడు సంగీత్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. తెలుగు మరియు కొడవ సంప్రదాయాల మేళవింపుతో జరిగిన వీరి వివాహం ఈ ఏడాది టాలీవుడ్‌లో అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు నిమిషాల్లోనే లక్షలాది లైకులు, కామెంట్లతో వైరల్ అయ్యాయి. విజయ్, రష్మికల వివాహ వేడుకలు ఫ్యాషన్ ప్రియులకు ఒక విందులా మారాయి. కొత్త దంపతులకు నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
