AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Tendulkar Wedding : అర్జున్-సానియా మెహందీ వేడుకలో మెరిసిపోయిన సారా టెండూల్కర్.. అదిరిపోయిన వీడియో

Arjun Tendulkar Wedding : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ ఇప్పుడు ఒక ఇంటికి మామగారు కాబోతున్నారు. సచిన్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ త్వర లోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు.

Arjun Tendulkar Wedding : అర్జున్-సానియా మెహందీ వేడుకలో మెరిసిపోయిన సారా టెండూల్కర్.. అదిరిపోయిన వీడియో
Arjun Tendulkar Wedding (1)
Rakesh
|

Updated on: Mar 04, 2026 | 6:40 AM

Share

Arjun Tendulkar Wedding : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ ఇప్పుడు ఒక ఇంటికి మామగారు కాబోతున్నారు. సచిన్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్‌తో అర్జున్ ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే వీరిద్దరి వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, వీరి పెళ్లి మార్చి 5న జరగనుంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

తాజాగా అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల మెహందీ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ముంబైలోని ప్రముఖ గలోప్స్ రెస్టారెంట్‌లో ఈ వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో అర్జున్ టెండూల్కర్ సంప్రదాయబద్ధమైన షేర్వానీలో మెరిసిపోతుండగా, కాబోయే భార్య సానియా చందోక్ అద్భుతమైన లెహంగాలో దేవకన్యలా కనిపిస్తోంది. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మెహందీ వేడుకలో టెండూల్కర్ కుటుంబం మొత్తం సందడి చేస్తూ కనిపించింది.

ఈ వేడుకలో అందరి కళ్లు సచిన్ గారాల పట్టి సారా టెండూల్కర్ పైనే ఉన్నాయి. తన తమ్ముడి మెహందీ ఫంక్షన్‌లో సారా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. డిజైనర్ లెహంగా ధరించి, మిరుమిట్లు గొలిపే ఆభరణాలతో సారా మెరిసిపోయింది. తన తల్లిదండ్రులు సచిన్, అంజలిలతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేసింది. సచిన్ టెండూల్కర్, అంజలి కూడా ట్రెడిషనల్ దుస్తుల్లో ఎంతో హుందాగా కనిపించారు. టెండూల్కర్ కుటుంబ సభ్యులందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

నిజానికి అర్జున్ టెండూల్కర్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కొన్ని రోజుల క్రితమే జామ్‌నగర్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ జరిగిన వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. అయితే, పెళ్లి ఎక్కడ జరుగుతుంది? ఎవరెవరు హాజరవుతారు? అనే విషయాలపై టెండూల్కర్ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పెళ్లి డేట్ మార్చి 5 అని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై సచిన్ సన్నిహితులు గోప్యత పాటిస్తున్నారు. ఏదేమైనా, ఒక సాదాసీదా క్రికెటర్ కొడుకుగా కాకుండా, తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్.. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుండటం విశేషం.

సానియా చందోక్ విషయానికి వస్తే, ఆమె అర్జున్ టెండూల్కర్‌కు చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తి అని సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారుతోంది. ముంబై క్రికెట్ వర్గాల్లో సానియా చందోక్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. వీరిద్దరి నిశ్చితార్థం కూడా గతంలోనే గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని టాక్. ఇప్పుడు పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతుండటంతో, క్రికెట్, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. మరి రేపు జరగబోయే ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కొడుకు పెళ్లిని ఎంత ఘనంగా చేస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us