AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొమ్మిది పదుల వయసులోనూ సైక్లింగ్ జోరు! వృద్ధాప్యాన్నే తిప్పికొట్టిన ఈమె హెల్తీ సీక్రెట్ తెలుసా?

వృద్ధాప్యం అనేది కేవలం శరీరానికి వచ్చే మార్పు మాత్రమే కానీ, మనసుకి కాదని నిరూపిస్తోంది ఒక విదేశీ బామ్మ. తొమ్మిది పదుల వయసులోనూ ముప్పై ఏళ్ల యువతిలాంటి ఉత్సాహం, ముఖంలో ఎప్పుడూ చెరగని చిరునవ్వు, భారతీయ సంస్కృతిపై అంకితభావం.. ఇవన్నీ చూస్తుంటే ఆమె వృద్ధాప్యాన్నే ఓడించిందా అనిపిస్తుంది.

తొమ్మిది పదుల వయసులోనూ సైక్లింగ్ జోరు! వృద్ధాప్యాన్నే తిప్పికొట్టిన ఈమె హెల్తీ సీక్రెట్ తెలుసా?
96 Year Old Grand Mother
Nikhil
|

Updated on: Mar 04, 2026 | 6:30 AM

Share

అమెరికాలో పుట్టినా, భారతీయ ఆధ్యాత్మికతకు ఫిదా అయ్యి ఇక్కడే స్థిరపడిన ఆ బామ్మ జీవనశైలి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఒకప్పుడు అమెరికాలోని ఒక ప్రముఖ సంస్థలో సక్సెస్‌ఫుల్ సేల్స్ మేనేజర్. విదేశాల్లో విలాసవంతమైన జీవితం, చేతినిండా డబ్బు.. అన్నీ ఉన్నా ఆమె మనసు మాత్రం ఏదో తెలియని ప్రశాంతత కోసం వెతికేది. ఆ అన్వేషణలో ఆమెకు భారతదేశం కనిపించింది. మన దేశపు ఆధ్యాత్మికత, ఇక్కడి సంస్కృతి ఆమెను ఎంతగా ప్రభావితం చేశాయంటే, తన పేరును మార్చుకోవడమే కాకుండా తన ఆహార్యాన్ని కూడా పూర్తిగా భారతీయురాలిలా మార్చేసుకుంది. తొంభై ఏళ్ల వయసులో కూడా హాస్పిటల్ గడప తొక్కకుండా, తన పనులు తనే చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఆ బామ్మ పేరు సుషుమ్న.

వృద్ధాప్యాన్ని జయించి..

కాలిఫోర్నియా బే ఏరియాకు చెందిన సుషుమ్న ప్రస్తుతం తమిళనాడులోని ఆధ్యాత్మిక కమ్యూనిటీలో సభ్యురాలిగా ఉంటూ సేవలందిస్తోంది. 2001 నుంచే ఆమె ఈ జీవనశైలికి అలవాటు పడింది. దీర్ఘాయువు అనేది ఎక్కడో దొరికేది కాదని, అది మన సంతోషం మరియు జీవన విధానం నుంచే వస్తుందని ఆమె తన జీవితం ద్వారా నిరూపిస్తోంది. ఇప్పటికీ ఆమె రోజుకు రెండు పూటలా సైక్లింగ్ చేస్తుందంటే ఆమె ఎంత చురుగ్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఆరోగ్య రహస్యాలు

వ్యవస్థాపకురాలు కమెల్ జాబర్ సోషల్ మీడియాలో ఈ బామ్మ హెల్తీ లైఫ్ సీక్రెట్స్ పంచుకోవడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. సుషుమ్న ఆరోగ్యానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయట. ముఖ్యంగా ఆహారం విషయంలో ఆమె ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా శరీరానికి సరిపడా వ్యాయామాలు, సైక్లింగ్ చేస్తారట. స్నేహితులతో కలివిడిగా ఉండటం, ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో చూడటం ఆమె అలవాట్లలో మొదటిది.

హాస్యం, ఆధ్యాత్మికత

తొంభై ఏళ్ల వయసులో తనకు ఆర్థరైటిస్ తప్ప మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని ఆమె గర్వంగా చెబుతుంది. తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి అసలు కారణం “మెడిసిన్స్ వాడటం మానేయడమే” అని ఆమె హాస్యస్పదంగా చెబుతుంటుంది. ప్రాశ్చాత్య దేశాల్లోని హైఫై లైఫ్ ను పక్కన పెట్టి, మన భారతీయతను మెచ్చి ఇక్కడ ఓ సామాన్య భక్తురాలిలా జీవించడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. వృద్ధాప్యం అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని సుషుమ్న నిరూపిస్తోంది. సానుకూల ఆలోచనలు, ఆరోగ్యకరమైన ఆహారం, ఆధ్యాత్మిక చింతన ఉంటే ఎవరైనా వృద్ధాప్యాన్ని తిప్పికొట్టవచ్చని ఆమె నిరూపిస్తోంది. నెటిజన్లు సైతం ఆమెను ‘సూపర్ బామ్మ’ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Follow Us