AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram : నా దగ్గర ఏమీ లేనప్పుడు నమ్మి నా చేయి పట్టుకుంది.. భార్యపై కిరణ్ అబ్బవరం కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడిప్పుడే వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఆయన నిర్మించిన లేటేస్ట్ మూవీ తిమ్మరాజు పల్లి టీవీ. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Kiran Abbavaram : నా దగ్గర ఏమీ లేనప్పుడు నమ్మి నా చేయి పట్టుకుంది.. భార్యపై కిరణ్ అబ్బవరం కామెంట్స్..
Kiran Abbavaram
Rajitha Chanti
|

Updated on: Apr 15, 2026 | 11:24 AM

Share

యువ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని సాధారణ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు.హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూుకుపోతున్నారు. అటు నటుడిగానే కాకుండా ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తన సొంత బ్యానర్ ‘KA ప్రొడక్షన్స్’ పతాకంపై సుమైరా స్టూడియోస్‌తో కలిసి ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తన భార్య, నటి రహస్య గోరఖ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

ఈ వేదికపై కిరణ్ మాట్లాడుతూ, తన కష్టకాలంలో రహస్య అందించిన అండను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. “నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో, ఏమీ లేని సమయంలో రహస్య నన్ను నమ్మి చేయి పట్టుకుంది. అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో నాకు భోజనం కూడా తీసుకువచ్చేది. నా ఎదుగుదలలో ఆమె పాత్ర ఎంతో ఉంది” అని పేర్కొన్నారు. ఈ సినిమాను తన భార్యకు ఒక ఎమోషనల్ ట్రిబ్యూట్‌గా ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి రహస్య కిరణ్ ‘CEO’గా వ్యవహరించడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి :  Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం 1990ల కాలం నాటి పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఆ రోజుల్లో ఊర్లో ఒకే ఒక్క టీవీ ఉంటే, దాని చుట్టూ ప్రజల భావోద్వేగాలు ఎలా ఉండేవనే అంశాన్ని దర్శకుడు వి. మునిరాజు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సుమారు 50 మంది కొత్త కళాకారులకు కిరణ్ ఈ సినిమా ద్వారా అవకాశం కల్పించడం గమనార్హం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు..

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: మీ కోసమే అంటూ ప్రేమగా 8 నెలలు స్లో పాయిజన్ ఇచ్చింది.. డాక్టర్ మాటలు విని షాకయ్యా.. జేడీ చక్రవర్తి

Follow Us