AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే అది ఇది వద్దు.. జస్ట్ 10 నిమిషాల్లోనే సూపర్‌ఫుడ్.. ఇక ఏ టిఫిన్ అక్కర్లేదు..

మల్టీ గ్రైన్ జావా అనేది శరీరానికి శక్తినిచ్చే పోషకమైన ఆహారం. దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. జావ లేదా అంబలి, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ అత్యంత ఆరోగ్యకరమైన పానీయం. రాగులు, సజ్జలు, ఓట్స్, జొన్నలు, బార్లీ వంటి ధాన్యాలతో ఇంట్లోనే ఈ పోషకమైన జావా పిండిని తయారుచేసి, కేవలం పది నిమిషాల్లో రుచికరమైన మాల్ట్‌ను సిద్ధం చేసుకోవచ్చు.

ఉదయాన్నే అది ఇది వద్దు.. జస్ట్ 10 నిమిషాల్లోనే సూపర్‌ఫుడ్.. ఇక ఏ టిఫిన్ అక్కర్లేదు..
Multigrain Java Recipe
Shaik Madar Saheb
|

Updated on: Apr 15, 2026 | 9:39 AM

Share

ఆరోగ్యకరమైన మల్టీ గ్రైన్ జావా లేదా అంబలి అనేది సంప్రదాయమైన, పోషక విలువలు పుష్కలంగా ఉన్న పానీయం.. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను, ముఖ్యంగా ఇనుము, కాల్షియంను అందించవచ్చు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఎంతో మేలు చేసే ఈ జావను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. దీంతో పాటు.. ఎండాకాలం ఈ జావ శరీరాన్ని చల్లగా ఉండేలా చేస్తుంది. అద్బుతమైన విటమిన్లు, ఖనిజాలు కలిగిన ఈ రెసిపీని ఇంట్లో జస్ట్ 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.. దీని తయారీలో రెండు ప్రధాన దశలు ఉంటాయి..మల్టీ గ్రైన్ పిండి తయారీ, జావా తయారీ.

మల్టీ గ్రైన్ పిండిని తయారుచేయడానికి, ముందుగా నాణ్యమైన ధాన్యాలను ఎంచుకోవాలి. ఈ మిశ్రమంలో రాగులు 1 kg, సజ్జలు 1/4 kg, ఓట్స్ 100 గ్రాములు, జొన్నలు 1/4 kg, బార్లీ 1/4 kg వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఈ ధాన్యాలన్నీ విడివిడిగా తీసుకోవాలి. ప్రతి ధాన్యాన్ని ఒక డ్రై పాన్ లో వేసి, అది కమ్మటి వాసన వచ్చేవరకు, సుమారు ఐదు నుండి ఏడు నిమిషాల పాటు తక్కువ మంటపై వేయించుకోవాలి. వేయించిన తర్వాత, వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత, ఈ వేయించిన ధాన్యాలను మిల్లులో లేదా ఇంట్లో గ్రైండర్ ఉపయోగించి మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఇది చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఈ పిండిని ఒకసారి సిద్ధం చేసుకుంటే, జావాను ఎప్పుడంటే అప్పుడు సులభంగా తయారు చేసుకోవచ్చు.

జావా తయారీ కోసం, ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మూకుడు లేదా గిన్నెను పెట్టి, అందులో తగినంత నీటిని వేసుకోవాలి. ఉదాహరణకు, మూడు కప్పుల జావ కోసం, మూడు కప్పుల నీటిని తీసుకోవచ్చు. నీరు బాగా మరుగుతున్నప్పుడు, మరో కప్పులో మూడు స్పూన్ల మల్టీ గ్రైన్ పిండిని తీసుకుని, కొద్దిగా నీటిని కలిపి ఉండలు లేకుండా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకోవడం వల్ల జావా వండేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది.

నీరు మరుగుతున్నప్పుడు, దానికి రుచికి సరిపడినంత ఉప్పును చేర్చాలి. ఆ తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న మల్టీ గ్రైన్ పిండి పేస్ట్‌ను మరుగుతున్న నీటిలో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. దీన్ని సుమారు పది నిమిషాల పాటు చిన్న మంటపై బాగా మరిగించాలి. ఈ పది నిమిషాల మరుగుదల వల్ల ధాన్యాలు చక్కగా ఉడికి, జావా చిక్కబడి, మంచి రుచి వస్తుంది. ఉడికిన తర్వాత స్టవ్ ఆపి, జావాను చల్లారనివ్వాలి. జావా చల్లారే సమయంలో, గరిటెతో అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పైన మీగడ కట్టకుండా జావా ఏకరీతిగా ఉంటుంది. జావా పూర్తిగా చల్లారిన తర్వాత, ఒక గ్లాస్ తాజా మజ్జిగను కలుపుకోవాలి. మజ్జిగ కలపడం వల్ల జావా రుచి మరింత పెరుగుతుంది. వేసవిలో శరీరానికి చలువ చేస్తుంది. ఇలా తయారుచేసుకున్న మల్టీ గ్రైన్ జావా ఎంతో ఆరోగ్యకరమైనది, పోషకమైనది.. రుచికరమైనది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us