AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Results 2026 Live: ఇంటర్ ఫలితాలు 2026 వచ్చేశాయ్.. ఒక్క క్లిక్‌తో ఫాస్ట్‌గా రిజల్ట్స్ చూసేయండి

Andhra Pradesh Inter Results 2026 Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాల గడియ వచ్చేసింది. బుధవారం ఉదయం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. పరీక్షలు రాసిన 10 లక్షల మందికి పైగా విద్యార్దులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు..

AP Inter Results 2026 Live: ఇంటర్ ఫలితాలు 2026 వచ్చేశాయ్.. ఒక్క క్లిక్‌తో ఫాస్ట్‌గా రిజల్ట్స్ చూసేయండి
AP inter Results
Srilakshmi C
|

Updated on: Apr 15, 2026 | 1:01 PM

Share

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను నేడు ఉదయం 10.31 గంటలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. ఒకే సమయంలో అటు ఫస్ట్ ఇయర్, ఇటు సెకండ్ ఇయర్ ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం నుంచి 5,26,264 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లా వారిగా చూస్తే, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సుమారు 1,02,000 మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను వేగంగా చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ https://results-bie.ap.gov.in ను సందర్శించవచ్చు. అలాగే వాట్సప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం 9552300009 అనే నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే చాలు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్లతో పాటు టీవీ9 వెబ్ సైట్ ద్వారా కూడా మీరు త్వరతగిన ఇంటర్ ఫలితాలను చూడవచ్చు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Apr 2026 11:41 AM (IST)

    ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల 2026 డైరెక్ట్ లింక్ ఇదే

    ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 15 Apr 2026 11:14 AM (IST)

    ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు.. టాప్‌ ర్యాంకులన్నీ వారివే

    ఏపీ ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల్లో అబ్బాయిలు 228908 రాయగా.. 165859 మంది (72 శాతం) ఉత్తీర్ణత పొందారు. సెకండ్ ఇయర్‌లో 214620 మంది పరీక్షలు రాయగా..1,63, 804 మంది (76 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇక ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల్లో అమ్మాయిలు 2,42,956 మంది రాయగా.. 1,95,667 మంది (81 శాతం) ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లో 2,31,917 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 1,96,012 మంది (85) ఉత్తీర్ణత పొందారు.

  • 15 Apr 2026 11:07 AM (IST)

    ఏపీ ఇంటర్ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ 2026 తేదీలు ఇవే

    ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాల్లో విద్యార్ధులకు ఎవరైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

  • 15 Apr 2026 11:05 AM (IST)

    ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల 2026 ఫీజు చెల్లింపు తేదీలు ఇవే

    ఏపీ ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు ఇంప్రూవ్‌మెంట్, రీ వెరిఫికేషన్‌ కోసం ఫీజు చెల్లింపులు ఏప్రిల్ 20, 2026వ తేదీ న ఉంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. విద్యార్దులు ఈ వారం రోజుల వ్యవధిలో ఫీజులు చెల్లించాలి.

  • 15 Apr 2026 11:03 AM (IST)

    ఫెయిలైన విద్యార్ధులకు ఎథిక్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ పరీక్షలు ఎప్పుడుంటాయంటే?

    ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్స్యూయ్‌ పరీక్షను జూన్‌ 5, 2026వ తేదీన, ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జూన్‌ 6వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

  • 15 Apr 2026 11:01 AM (IST)

    ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాయాలంటే.. ఈ షరతులు తప్పనిసరి

    ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులు ఎవరైనా ప్రాక్టికల్స్, సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ రాయాలంటే తొలుత సాధించిన మార్కులను రద్దు చేసుకోవల్సి ఉంటుంది.

  • 15 Apr 2026 10:59 AM (IST)

    ఏపీ ఇంటర్ ప్రాక్టిలక్‌ పరీక్షలు 2026 ఎప్పట్నుంచంటే?

    ఫెయిలైన విద్యార్ధులకు ఇంటర్ ప్రాక్టిలక్‌ పరీక్షలు జూన్‌ 7, 2026వ తేదీ నుంచి జూన్‌ 11, 2026వ తేదీ వరకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు.

  • 15 Apr 2026 10:58 AM (IST)

    ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల 2026 పూర్తి షెడ్యూల్ ఇదే

    ఏపీ ఇంటర్ 2026 సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్‌ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్‌ సెషన్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది.

  • 15 Apr 2026 10:57 AM (IST)

    మే 21 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ 2026 పరీక్షలు షురూ..

    ఏపీ ఇంటర్ 2026 సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్‌ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

  • 15 Apr 2026 10:55 AM (IST)

    రాష్ట్రంలోనే అత్యంత తక్కువ మంది విద్యార్ధులు ఉత్తీర్ణత పొందిన జిల్లా ఇదే..

    ఇంటర్ ఫలితాల్లో అత్యల్ప ఉత్తీర్ణత అన్నమయ్య జిల్లాల్లో నమోదైంది. కేవలం 62 శాతం మంది విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఫస్ట్‌ ఇయర్‌లో 11,832 మంది పరీక్షలు రాయగా.. 7,981 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్‌ ఇయర్‌లో 12,886 మంది పరీక్షలు రాయగా,  7,969 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.

  • 15 Apr 2026 10:53 AM (IST)

    ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్..

    ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదు చేసింది. ఏకంగా 92 శాతం మార్కులతో సత్తా చాటింది. ఆ తర్వాత స్థానంలో గుంటూరూ 88 శాతం, ఎన్టీఆర్ జిల్లా 87 శాతం మార్కులతో అదరగొట్టాయి.

  • 15 Apr 2026 10:50 AM (IST)

    ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 77%, సెకండ్‌ ఇయర్‌లో 81% మంది ఉత్తీర్ణత

    ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 5,10,307 మంది, సెకండ్‌ ఇయర్‌లో 5,05,609 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. మొత్తం10,15,916 మంది రాయగా.. వీరిలో ఫస్ట్‌ ఇయర్‌లో 77%, సెకండ్‌ ఇయర్‌లో 81% ఉత్తీర్ణత సాధించారు.

  • 15 Apr 2026 10:45 AM (IST)

    ‘ఫెయిలైన విద్యార్ధులు అధైర్య పడొద్దు.. మీకు మేమంతా తోడున్నాం’.. లోకేష్

    విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లు, విద్యా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి కృషికి నిదర్శనం. ఈసారి విజయాన్ని అందుకోలేకపోయిన విద్యార్థులు నిరుత్సాహపడకండి. దీన్ని ఒక పాఠంగా తీసుకుని మరింత కష్టపడి మళ్లీ బలంగా ముందుకు రండి. ఈ సున్నిత సమయంలో విద్యార్థులకు తల్లిదండ్రులు, కళాశాలలు, సమాజం మొత్తం మానసికంగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను. అందర విద్యార్థులకు భవిష్యత్తు కోసం హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు మరింతగా నేర్చుకుంటూ, అభివృద్ధి చెందుతూ, విజయాలను సాధించాలి… అంటూ మంత్రి లోకేష్‌ ట్వీట్‌లో అభనందనలు తెలిపారు.

  • 15 Apr 2026 10:44 AM (IST)

    సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్ధులు.. మంత్రి లోకేష్ అభినందనలు

    ప్రత్యేకంగా ప్రభుత్వ , ప్రభుత్వ నిర్వహిత కళాశాలల్లో సాధించిన పురోగతి ఎంతో ప్రశంసనీయం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (GJCs) మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 54%గా నమోదై, ఇది గత 12 ఏళ్లలోనే అత్యధికం. రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 68%గా ఉండి, ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితం.

  • 15 Apr 2026 10:42 AM (IST)

    ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 81 శాతం ఉత్తీర్ణత.. గత 12 ఏళ్ల రికార్డు బ్రేక్

    ఈ సంవత్సరంలోని ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ (IPE) ఫలితాలు గత 12 ఏళ్లలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మొదటి సంవత్సరం 77%, రెండో సంవత్సరం 81% ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితంగా నిలిచింది.

  • 15 Apr 2026 10:39 AM (IST)

    ఏపీ ఇంటర్ ఫలితాల్లో గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత

    ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో గరిష్ఠ ఉత్తీర్ణత నమోదైంది. గత 12 సంవత్సరాలలో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని విద్యార్ధులు సాధించినట్లు మంత్రి నారా లోకేష్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 77%, ద్వితియ సంవత్సరంలో 81% ఉత్తీర్ణత నమోదైంది.

  • 15 Apr 2026 10:35 AM (IST)

    ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్..

    ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్..

  • 15 Apr 2026 10:32 AM (IST)

    ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

    ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను 2026 విద్యాశాఖ మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఫలితాలను ఈ కింది లింక్ లో డైరెక్ట్ గా చెక్ చేసుకోండి.

    ఏపీ ఇంటర్ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 15 Apr 2026 10:28 AM (IST)

    ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2026 మార్కుల ఫార్మట్ లో కీలక మార్పులు..

    ఈ ఏడాది ఏపీ ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో చేసిన సంస్కరణల నేపథ్యంలో 6వ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ మార్కులను సాధించిన మొత్తం మార్కులతో కలపడం జరగదు. అదనపు సబ్జెక్ట్ మార్కులను విడిగా ఇస్తారు.

    ఇక ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ మార్కుల ఫార్మట్‌లో మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు. ఎలాంటి మార్పులు ఉండవు.

  • 15 Apr 2026 10:25 AM (IST)

    ఏపీ ఇంటర్ ఫలితాలు డౌన్‌లోడ్‌- లింక్స్ ఇవే..

    లేదా

  • 15 Apr 2026 10:22 AM (IST)

    ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ మార్కుల జాబితాలో 6వ సబ్జెక్ట్ మార్కులు ఎక్కడ ఉంటాయంటే?

    విద్యార్థులు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌తోపాటు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌, మనమిత్ర వాట్సప్‌ నెంబర్‌ ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు.

  • 15 Apr 2026 10:18 AM (IST)

    అందుకే ఈసారి ఇంటర్ పరీక్షలు, మూల్యాంకనం కాస్త ఆలస్యం..

    ఈ ఏడాది ఇంటర ప్రథమ సంవత్సరంలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు ఏకంగా నెల రోజుల సమయం పట్టింది. దీంతో మూల్యాంకనం పూర్తి కావడంలో కొంత ఆలస్యమైనప్పటికీ అనుకున్న సమయానికన్నా కాస్త ముందే ఫలితాలను విడుదలకు ఇంటర్ బోర్డు సిద్ధం చేసింది. ఏపీ ఇంటర్ ఫలితాలతో పాటు దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

    టీవీ9 తెలుగు వెబ్ సైట్ లో నిరంతర అప్ డేట్స్ చెక్ చేసుకోండి.

  • 15 Apr 2026 09:55 AM (IST)

    మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా ఇంటర్ ఫలితాలు

    రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా ఎక్స్ వేదికగా బుధవారం ఉదయం 10.31 గంటలకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు.

  • 15 Apr 2026 09:54 AM (IST)

    ఇంటర్ మార్కుల మెమోలో ఈ మార్కులు గమనించారా?

    ఇంటర్‌ విద్య మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది ఒక రోజు ఒక్క సబ్జెక్టుకే పరీక్షలు జరిగాయి. ప్రధాన సబ్జెక్టులకు మార్కుల మెమో విడుదల చేస్తారు. అదనపు సబ్జెక్టు ఫలితాలను ప్రత్యేక మెమో రూపంలో విడుదల చేస్తారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

  • 15 Apr 2026 09:52 AM (IST)

    వాట్సప్ ద్వారా నేరుగా రిజల్ట్స్ చెక్ చేసుకోండి..

    ఇంటర్ ఫలితాలు ఏపీ మన మిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ 9552300009 నంబరుకు మెసేజ్‌ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఫస్టియర్‌ 5.31 లక్షలు, సెకెండియర్‌ 5.26 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 10 లక్షల మంది పరీక్షలు రాశారు.

  • 15 Apr 2026 09:47 AM (IST)

    మరికాసేపట్లో.. 10.50 లక్షల మంది విద్యార్ధుల ఉత్కంఠకు తెర..

    ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10.50 లక్షల మంది రాశారు. వీరంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

  • 15 Apr 2026 09:45 AM (IST)

    ఉదయం 10.31 నిమిషాలకు ఎక్స్ వేదికగా ఇంటర్ ఫలితాలు విడుదల

    ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి నారా లోకేశ్‌ ఈ రోజు ఉదయం 10.31 గంటలకు ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేయనున్నారు

  • 15 Apr 2026 09:40 AM (IST)

    ఒక్క క్లిక్‌తో ఇలా చూడండి..

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలను నేడు ఉదయం 10.31 గంటలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. టీవీ9 వెబ్ సైట్‌లో ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..

Published On - Apr 15,2026 9:38 AM

Follow Us