Nara Lokesh: చంద్రబాబు సంచలన నిర్ణయం.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్
టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నారా లోకేష్‌కు ప్రమోషన్ దక్కింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ ఉండగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ ఉండనున్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రకటన చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ని కొనసాగించారు. మొత్తం 29 మందితో పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయగా.. 31 మందితో జాతీయ కమిటీని నియమించారు. అలాగే 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జాతీయ కార్యదర్శులుగా ముగ్గురికి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చింది టీడీపీ. నారా లోకేష్‌కు ప్రమోషన్ కల్పిస్తారని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయనను ప్రకటిస్తారనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన మహానాడులో దీనిపై నిర్ణయం తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు దానిపై నిర్ణయం తీసుకున్నారు.
నియమాలు ఇవే..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేశ్ కిలార్‌లను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురిని, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని, జాతీయ అధికారి ప్రతినిధులుగా 10 మందికి బాధ్యతలు అప్పగించారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 7, ఉపాధ్యక్షులు 16, అధికార ప్రతినిధులు 14, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లు 10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు 59, రాష్ట్ర కార్యదర్శులు 77 మందిని ప్రకటించారు. ఇక రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలు ఉండగా.. జాతీయ కమిటీలు, పొలిట్ బ్యూరోలో కూడా మహిళలకు అవకాశం కల్పించారు. సామాజిక, ప్రాంతీయ అంశాలను పరిగణలోకి తీసుకుని పదవులు అప్పగించారు. కష్టపడే తత్వం, పార్టీకి కట్టుబడి ఉండటం లాంటివి పరిగణలోకి తీసుకుని పార్టీ పదవులు అప్పగించారు.
