చెకింగ్ చేస్తున్న పోలీసులను చూసి.. స్పీడ్ పెంచిన బైక్ రైడర్.. ఆపి చూస్తే షాక్..!
వారు జైల్లో స్నేహితులు అయ్యారు. సాధారణంగా జైలుకు వెళ్లిన తరువాత బయటకు వచ్చాక చాలామంది మారుతారు.. అందులోనూ స్నేహం కుదిరితే వారి తప్పులు తెలుసుకుని.. మంచిగా మారే ప్రయత్నం చేస్తారు.. రసాల అంటే కొందరు తమ తప్పులను సరిదిద్దుకునే ప్రదేశం అని భావిస్తారు. కానీ, మరికొందరు మాత్రం అక్కడ కొత్త నేరస్తులతో పరిచయాలు పెంచుకుని, బయటకు వచ్చాక మరింత భారీ స్కెచ్‌లు వేస్తారు.

వారు జైల్లో స్నేహితులు అయ్యారు. సాధారణంగా జైలుకు వెళ్లిన తరువాత బయటకు వచ్చాక చాలామంది మారుతారు.. అందులోనూ స్నేహం కుదిరితే వారి తప్పులు తెలుసుకుని.. మంచిగా మారే ప్రయత్నం చేస్తారు.. రసాల అంటే కొందరు తమ తప్పులను సరిదిద్దుకునే ప్రదేశం అని భావిస్తారు. కానీ, మరికొందరు మాత్రం అక్కడ కొత్త నేరస్తులతో పరిచయాలు పెంచుకుని, బయటకు వచ్చాక మరింత భారీ స్కెచ్‌లు వేస్తారు. తాజాగా చర్లపల్లి జైలులో పరిచయమైన ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
మల్కాజిగిరి జిల్లా కండ్లకోయకు చెందిన నీలపు నీలయ్య (26), సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన బత్తిని నరేష్ (అలియాస్ లవ్లీ నరేష్) గతంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అరెస్టయ్యారు. జైలుకు వెళ్లారు. వీరిద్దరి మధ్య చర్లపల్లి జైలులో పరిచయం ఏర్పడింది. సాధారణంగా జైలు నుంచి బయటకు వచ్చాక జీవితాన్ని మార్చుకోవాలని చాలామంది అనుకుంటారు, కానీ వీరిద్దరూ మాత్రం నేర ప్రపంచంలో ఎదగడానికి ఒకరినొకరు తోడయ్యారు.
గత డిసెంబర్‌లో జైలు నుంచి విడుదలైన ఈ ఇద్దరూ, పటాన్‌చెరులో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. చిన్న దొంగతనాలతో పెద్దగా లాభం లేదని భావించిన ఈ జంట, ఈజీ మనీ కోసం భారీ చోరీలకు ప్లాన్ చేశారు. హైదరాబాద్ అడ్డాగా మేడ్చల్, దుండిగల్, అమీన్‌పూర్, సంగారెడ్డి ,నల్లగొండ జిల్లాలోని చిట్యాల ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు. పార్కింగ్ చేసిన బైకుల హ్యాండిల్ లాక్‌లు విరగ్గొట్టి క్షణాల్లో మాయం చేసేవారు. అలాగే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి లూటీ చేసేవారు. పగటిపూట రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడేవారు. అంతేకాదు దేవుడి విగ్రహాలను కూడా వదలకుండా ఆలయాల్లో దొంగతనాలకు తెగబడ్డారు.
ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా చిట్యాల పరిసరాల్లో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న వీరిద్దరినీ అడ్డుకున్నారు. విచారణలో వీరు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో తాము చేసిన నేరాలను నిందితులు అంగీకరించారు. నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల నుంచి సుమారు రూ. లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల అరెస్టు తోపాటు వీరి నుండి10 లక్షల విలువైన ఆరు బైకులు, ఆలయాల్లో దొంగిలించిన దుర్గాదేవి, సింహం పంచలోహ విగ్రహాలు, 5 గ్రాముల బంగారు వస్తువులు , స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నామని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి చెప్పారు. జైలులో మొదలైన వీరి నేర స్నేహం చివరకు మళ్ళీ జైలు ఊచల వెనకే ముగిసింది. ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, చట్టం నుండి తప్పించుకోవడం అసాధ్యమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
