రోజూ ఫిల్టర్ కాఫీ తాగితే వృద్ధాప్యం ఆలస్యమ‌వుతుందా?

21 July 2026

TV9 Telugu

TV9 Telugu

చాలా మందికి ఉద‌యం నిద్ర లేవ‌గానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే రోజూ ఫిల్టర్ కాఫీ తాగితే వృద్ధాప్యం ఆలస్యమ‌వుతుందనే దానిపై తాజా అధ్యయనంలో వెల్లడైంది

TV9 Telugu

ఫిల్టర్ కాఫీ తాగే వారిలో జీవసంబంధిత వృద్ధాప్య వేగం తక్కువగా ఉండటంతో పాటు టెలోమీర్‌ల పొడవు ఎక్కువగా ఉండే ధోరణి కనిపించింది

TV9 Telugu

ఫిల్టర్ కాఫీ ఎందుకు మెరుగైన ఫలితాలతో సంబంధం చూపిందో ఈ అధ్యయనం నిర్ధారించలేదు. అయినప్పటికీ పరిశోధకులు కొన్ని సాధ్యమైన కారణాలను వెల్లడించారు

TV9 Telugu

ఫిల్టర్ కాఫీలో వందలాది బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. వాటిలో క్లోరోజెనిక్ ఆమ్లాలు, పాలీఫినాల్స్, కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు ముఖ్యమైనవి

TV9 Telugu

ఇవి వాపుల‌ను తగ్గించడం, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయ‌ని గత పరిశోధనలు సూచించాయి

TV9 Telugu

అలాగే సిస్టాటిన్ సి, బేసల్ మెటబాలిక్ రేట్, గ్లైకోప్రోటీన్ అసిటైలేషన్ వంటి బయోమార్కర్లు కూడా ఈ సంబంధంలో కొంత పాత్ర పోషించినట్లు పరిశోధకులు గుర్తించారు

TV9 Telugu

ఫిల్టర్ చేయని కాఫీలో ఉండే కాఫెస్టాల్, కాహ్వియోల్ అనే సహజ సమ్మేళనాల‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎల్‌డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే అవకాశం ఉంటుంది

TV9 Telugu

ఫిల్టర్ పేపర్ వీటిలో గణనీయమైన భాగాన్ని తొలగిస్తుంది. అందుకే అధికంగా కాకుండా రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల కాఫీ తాగితే సరిపోతుంది