చాణక్య నీతి : జీవితంలో ఎక్కువగా మోసపోయే వ్యక్తులు వీరే

Samatha

21 July 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, తత్వవేత్త. ఈయన చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

అలాగే చాణక్యుడు  ఎలాంటి వ్యక్తులు తమ జీవితంలో ఎక్కువగా మోసపోతారో తెలియజేయడం జరిగింది. వారు ఎవరో చూసేద్దాం.

మోసపోయే వ్యక్తులు

అడవిలో ఎక్కువగా నిటారుగా ఉన్న చెట్లనే నరికేస్తారు. అదే విధంగా సమాజంలో కూడా నిరాడంబరంగా, ప్రశాంతంగా ఉండే వారినే మోసం చేస్తారని చెప్పుకొచ్చాడు.

అమాయకపు వ్యక్తులు

జిత్తుల మారి వ్యక్తుల, ఎక్కువగా అమాయకపు వ్యక్తులనే మోసం చేస్తారు. జీవితంలో వీరే ఎక్కువగా మోసపోతారని ఆయన చెప్పుకొచ్చారు.

సున్నితమైన వ్యక్తులు

అదే విధంగా ఎవరినైనా సరే గుడ్డిగా ఎవరు నమ్ముతారో, అలాంటి వ్యక్తులు జీవితంలో చాలా త్వరగా మోసపోతారంట.

గుడ్డిగా నమ్మే వ్యక్తులు

అంతే కాకుండా మితిమీరిన భావోద్వేగం, ఎక్కువగా బంధాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి జీవితంలో ఎక్కువ సార్లు మోసపోతారంట.

భావోద్వేగం

అలాగే పొగడ్తలకు పడిపోయే వ్యక్తి, ఏ వ్యక్తి అయితే పదే పదే ఇతరుల పొగడ్తలు అబద్ధం అయినా సరే వాటిని వినడానికి ఇష్టపడతాడో, అలాంటి వ్యక్తి ఎప్పుడూ మోసపోతూనే ఉంటాడు.

పొగడ్తలకు పడిపోవడం

అలాగే ప్రతీదానికి ఇతరులపై ఆధారపడే వ్యక్తులు కూడా  జీవితంలో పదే పదే మోసపోతారు అని చెప్పుకొచ్చాడు. ఆ చార్య చాణక్యుడు.

ఇతరులపై ఆధారపడటం