AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మెయిడీన్ ఓవర్‌తో వికెట్.. కాటేరమ్మ కొడుకుల దూల తీర్చేశారుగా..!

Gujarat Titans vs Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా నేడు జరుగుతున్న 56వ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఈ పోరులో లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్, ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. గుజరాత్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు.

Video: మెయిడీన్ ఓవర్‌తో వికెట్.. కాటేరమ్మ కొడుకుల దూల తీర్చేశారుగా..!
Gt Vs Srh Score
Venkata Chari
|

Updated on: May 12, 2026 | 10:08 PM

Share

Gujarat Titans vs Sunrisers Hyderabad, 56th Match: భారతీయ క్రికెట్ పండుగ ఐపీఎల్ 19వ సీజన్‌లో బ్యాటర్ల విధ్వంసం ఒకవైపు కొనసాగుతుంటే, మరోవైపు బౌలర్లు తమ పదునైన బంతులతో వికెట్-మెయిడెన్ ఓవర్లు వేసి సత్తా చాటుతున్నారు. పరుగుల వరద పారే టీ20 ఫార్మాట్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా వికెట్ తీయడం అనేది బౌలర్ల నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఏడాది టోర్నీలో ఆ ఘనత సాధించిన టాప్ బౌలర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. గుజరాత్ పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. కేవలం 3.2 ఓవర్లలోనే హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న బ్యాటర్లపైనే జట్టు ఆశలన్నీ ఆధారపడి ఉన్నాయి.

లక్నో వేదికగా మొహ్సిన్ ఖాన్ హ్యాట్రిక్ విన్యాసం..

లక్నో సూపర్ జెయింట్స్ యువ ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. హోమ్ గ్రౌండ్ అయిన లక్నోలో అతను ఏకంగా మూడు సార్లు వికెట్-మెయిడెన్ ఓవర్లు వేసి రికార్డు సృష్టించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహ్సిన్ తన పదునైన బంతులతో వికెట్ తీయడమే కాకుండా ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పోరులో కూడా ఇదే విధమైన ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జరిగిన మరో మ్యాచ్‌లో కూడా వికెట్-మెయిడెన్ ఓవర్ వేసి లక్నో జట్టుకు కీలక సమయంలో బ్రేక్ ఇచ్చాడు.

వాంఖెడేలో అఖీల్ హొస్సేన్ స్పిన్ మాయాజాలం..

ముంబైలోని ప్రసిద్ధ వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ అఖీల్ హొస్సేన్ అద్భుతం చేశాడు. బ్యాటర్లకు స్వర్గధామం లాంటి ఈ పిచ్‌పై వికెట్ తీస్తూ మెయిడెన్ ఓవర్ వేయడం ద్వారా చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఢిల్లీలో సుయాష్ శర్మ.. అహ్మదాబాద్‌లో రబాడ..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ సుయాష్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో వారి సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్-మెయిడెన్ ఓవర్‌తో ఆకట్టుకున్నాడు. మరోవైపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పేసర్ కాగిసో రబడ తన వేగంతో వికెట్ పడగొట్టి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఓవర్‌ను ముగించాడు.

రాయ్‌పూర్‌లో కోర్బిన్ బాష్ మెరుపులు..

రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ కోర్బిన్ బాష్ తన సత్తా చాటాడు. అత్యంత ఒత్తిడితో కూడిన సమయంలో వికెట్-మెయిడెన్ ఓవర్ వేయడం ద్వారా జట్టును పోటీలో నిలిపాడు. ఈ బౌలర్లందరూ తమ అద్భుతమైన బౌలింగ్‌తో ఐపీఎల్ 2026లో బౌలర్ల ఆధిపత్యాన్ని చాటిచెప్పారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us