పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో రాజవొమ్మంగి మండలంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తిరిగి ప్రత్యక్షమైన పులి ఆవులు, లేగదూడలపై దాడులు చేస్తోంది. చికీలంత, అమీనాబాద్ కాలనీల సమీపంలో పశువులను చంపి సగభాగం తినేసి వదిలేస్తోంది. అటవీశాఖ అధికారుల సమాచారం లోపంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నారు.