AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Class 10 Results 2026: సీబీఎస్‌ఈ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 43 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఇందులో పదో తరగతి పరీక్షలకే ఏకంగా 25 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరంతా ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి..

CBSE Class 10 Results 2026: సీబీఎస్‌ఈ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే
CBSE Class 10 Results Released
Srilakshmi C
|

Updated on: Apr 15, 2026 | 4:40 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 14: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 10వ తరగతి ఫలితాలను బుధవారం (ఏప్రిల్‌ 15) ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌వెబ్‌సైట్‌లలో https://www.cbse.gov.in/ లేదా results.cbse.nic.in లేదా cbse.nic.in మాత్రమే ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. వీటితోపాటు డిజిలాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG) యాప్‌ల ద్వారా కూడా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 43 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఇందులో పదో తరగతి పరీక్షలకే ఏకంగా 25 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. అయితే గత ఏడాది10వ, 12వ తరగతి ఫలితాలు రెండూ ఒకేసారి మే 13న ప్రకటించారు. అయితే మే 15న 10వ తరగతి బోర్డు పరీక్షల రెండవ సెషన్ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే 12వ తరగతి ఫలితాల కంటే ముందే 10వ తరగతి ఫలితాలను సీబీఎస్సీ బోర్డు వెల్లడించింది. విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్‌లను మెరుగుపరుచుకునేందుకు వీలుగా సీబీఎస్ఈ ఈ ఏడాది రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసే విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఈ ఏడాది నుంచి 10వ తరగతిలో ఒకటి లేదా రెండు మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపే విధానం కూడా తీసుకువచ్చారు. అయితే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు పొందాలి. అప్పుడే గ్రేస్‌ మార్కులు కలిపిందుకు వీలుంటుంది. ఇక 12వ తరగతి పరీక్షలు 2026 కూడా ఫిబ్రవరి 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. 12వ తరగతి పరీక్షలు 2026 ఏప్రిల్ 10న ముగిశాయి. ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

CBSE 10వ తరగతి ఫలితాలను 2026 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

  • ముందుగా CBSE అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
  • ‘2026 ఫలితాలు’ విభాగం కింద ఉన్న ‘సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ (క్లాస్ X) 2026’ పై క్లిక్ చేయండి.
  • రోల్ నంబర్, పాఠశాల నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడి, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నమోదు చేయాలి.
  • అనంతరం ‘సబ్‌మిట్‌’ పై క్లిక్ చేయండి. వెంటనే మీ మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి.

సీబీఎస్‌ఈ పదో తరగతి 2026 ఫలితాలు ఈ కింది డైరెక్ట్ లింక్ ల ద్వారా చెక్ చేసుకోండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..