Shani Dev 2023: కొత్త ఏడాదిలో కుంభరాశిలో ప్రవేశించనున్న శని.. ఈ మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే .. అన్ని శుభఫలితాలే..
2023 సంవత్సరంలో.. శనీశ్వరుడు మార్పు కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. అయితే మరి కొందరు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కుంభరాశిలో శని సంచారం వల్ల ఈ రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరుతాయి. శనీశ్వరుడు అనుగ్రహం వీరిపై కురుస్తుంది.
కొత్త సంవత్సరం 2023 కి మరికొన్ని రోజుల్లో స్వాగతం చెప్పనున్నాం.. దీంతో కొందరు తమకు కొత్త ఏడాదిలోనైనా సుఖ సంతోషాలు కలగాలని చేపట్టిన పనుల్లో విజయం దక్కాలని కోరుకుంటారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రేమ, విద్య , ఆర్థిక జీవితం కొత్త ఏడాదిలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరం కొన్ని రాశులవారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. 2023 సంవత్సరంలో.. జనవరి 17న శనీశ్వరుడు మకరరాశిని వదిలి.. తన సొంత రాశి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే శనీశ్వరుడు ప్రతి మనిషికి అతని కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఎవరి జాతకంలో ఏలిన నాటి శని ప్రభావం ఉంటుందో.. వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతారు. శనీశ్వరుడి అనుగ్రహం ఉన్న వ్యక్తి రాజు అవుతాడు. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2023 సంవత్సరంలో.. శనీశ్వరుడు మార్పు కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. అయితే మరి కొందరు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కుంభరాశిలో శని సంచారం వల్ల ఈ రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరుతాయి. శనీశ్వరుడు అనుగ్రహం వీరిపై కురుస్తుంది. శనీశ్వరుడు అనుగ్రహంతో ఏడాది పొడవునా ఏ పనికి ఆటంకాలు ఏర్పడవు పట్టిందల్లా బంగారమే అని అంటున్నారు.
2023 లో ఈ రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం:
2023లో కుంభరాశిలో శనీశ్వరుడు ప్రవేశంతో మిథునరాశి, తులారాశిపై శని ప్రభావం అంతమవుతుంది. అంతేకాదు ధనుస్సు రాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది.
మిథున రాశి : 2023లో శనీశ్వరుడు సంచారం మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శని అనుగ్రహంతో రాబోయే సంవత్సరంలో మీరు అదృష్టవంతులు అవుతారు. ఈ సమయంలో ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. నిలిచిపోయిన పనులన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి. 2023లో మిథున రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అంతేకాదు భూమి-ఆస్తి, స్థిరా ఆస్తికి సంబంధించిన విషయాల్లో కూడా లాభాలు కలుగుతాయి. వాహనాలు, గృహాలను కొనుగోలు చేయాలనే కోరిక కూడా ఈ సంవత్సరం విజయవంతమవుతాయి. 2023 సంవత్సరంలో.. ఈ రాశి వ్యక్తులు వ్యాపారానికి సంబంధించి పనులు ప్రారంభించవచ్చు. వీరు ఏ పనులు ప్రారంభించినా అవి ఆర్ధిక ప్రయోజనాలు ఇస్తాయి.
తుల రాశి : శుక్రుడు తుల రాశికి అధిపతి. అంతేకాదు ఈ రాశి శనీశ్వరుడు అధిక రాశి కూడా. శని, శుక్ర గ్రహాల మధ్య స్నేహ భావన కారణంగా ఈ రాశి వ్యక్తులపై శనీశ్వరుడు శుభ ప్రభావం చూపుతాడు. ఈ రాశి వ్యక్తులు చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి.
ధనుస్సు రాశి : 2023లో ధనుస్సు రాశి వారికి ఏలిన నాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ధనుస్సు రాశికి అధిపతి దేవగురువు బృహస్పతిగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రంలో.. శనీశ్వరుడు బృహస్పతి కలయికను సమాన సంబంధం అంటారు. ఈ రెండు గ్రహాలకు ఒకదానితో ఒకటి శత్రుత్వం లేదు. అటువంటి పరిస్థితిలో.. శనీశ్వరుడు అనుగ్రహం కారణంగా, ఈ రాశి వ్యక్తులు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు, ధనలాభాలను పొందుతారు. సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రాశులవారు చేయాల్సిన నివారణ చర్యలు:
నువ్వులు, మినప పప్పు శనివారం దానం చేయాలి. ఈ దానాన్ని పేద బ్రాహ్మణునికి, పేదవారికి ఇవ్వాలి. హనుమాన్ చాలీసాను కనీసం 9 లేదా 11 శనివారాల్లో క్రమం తప్పకుండా చదవాలి. నల్ల ఆవు , నల్ల కుక్కను శనివారం నాడు ఆహారాన్ని అందించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)