AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం లేదా? అయితే నష్టపోవడానికి రెడీ అయిపోండి!

స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను నిర్లక్ష్యం చేయడం వల్ల భద్రతా ప్రమాదాలు, పనితీరు సమస్యలు ఎదురవుతాయి. ప్రతి అప్‌డేట్‌లో హ్యాకర్ల నుండి రక్షణ కోసం సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు బగ్ ఫిక్స్‌లు ఉంటాయి. ఇవి మీ ఫోన్ స్పీడ్‌ను, బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరుస్తాయి.

ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం లేదా? అయితే నష్టపోవడానికి రెడీ అయిపోండి!
Smartphone Software Updates
SN Pasha
|

Updated on: Mar 04, 2026 | 7:30 AM

Share

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో చాలామంది తర్వాత చూద్దాం అంటూ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇలా నిరంతరం అప్డేట్ చేయకపోతే భద్రత నుంచి పనితీరు వరకు అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల భద్రతా ప్రమాదం పెరుగుతుంది. ప్రతి సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లో హ్యాకర్లు ఉపయోగించే లోపాలను మూసివేసే సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉంటాయి. అప్డేట్ చేయకపోతే మీ ఫోన్ మాల్వేర్, ఫిషింగ్ దాడులకు సులభ లక్ష్యంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ ఉపయోగించే వారికి ఇది పెద్ద ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

కంపెనీలు అప్డేట్‌ల ద్వారా బగ్‌లను సరిచేసి ఫోన్ స్పీడ్‌ను మెరుగుపరుస్తాయి. అప్డేట్ వాయిదా వేస్తే యాప్స్ హ్యాంగ్ అవడం, ఫోన్ స్లో అవడం, బ్యాటరీ వేగంగా ఖాళీ కావడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కెమెరా మెరుగుదలలు, బ్యాటరీ ఆప్టిమైజేషన్, కొత్త AI ఫీచర్లు వంటి వాటిని అప్డేట్‌ల ద్వారానే అందిస్తారు. అప్డేట్ చేయని వినియోగదారులు ఈ ప్రయోజనాల నుంచి దూరమవుతారు.

యాప్ కంపాటిబిలిటీ సమస్యలు వస్తాయి. కాలక్రమేణా కొన్ని యాప్స్ కొత్త ఆండ్రాయిడ్ లేదా iOS వెర్షన్‌లకు మాత్రమే సపోర్ట్ ఇస్తాయి. ఫోన్ అప్డేట్ చేయకపోతే కొన్ని యాప్స్ పని చేయకపోవచ్చు లేదా ఇన్‌స్టాల్ కాకపోవచ్చు. అయితే అప్డేట్ ముందు వై-ఫై కనెక్షన్, సరిపడా బ్యాటరీ, డేటా బ్యాకప్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ను వాయిదా వేయడం తాత్కాలికంగా సమయం ఆదా చేసినట్టు అనిపించినా, దీర్ఘకాలంలో భద్రతా ప్రమాదాలు, పనితీరు సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఫోన్ వచ్చిన అప్డేట్‌లను సమయానికి ఇన్‌స్టాల్ చేయడం ఉత్తమ అలవాటు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us