AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్ జర్నీకి రెడీ అయిపోండి

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీపై ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఎయిర్‌పోర్ట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలోపే.. విశాఖలో ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఏపీ సర్కార్‌ టార్గెట్‌కు అనుగుణంగా VMRDA కూడా భూసేకరణ.. రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేస్తోంది. ఇంతకీ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీని పెంచే మాస్టర్‌ ప్లాన్‌లోని ఏడు రోడ్లు ఏంటి?...

Andhra: జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్ జర్నీకి రెడీ అయిపోండి
Vizag
Ravi Kiran
|

Updated on: Mar 04, 2026 | 7:51 AM

Share

ఉత్తరాంధ్ర దశ-దిశను మార్చే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూన్ నాటికి ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ ప్రారంభించేలా ఏర్పాట్లు ముమ్మురం అవుతున్నాయి. అయితే.. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే.. విశాఖ నుంచి భోగాపురం వైపు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కానీ.. విశాఖలోని ప్రస్తుత రోడ్లు, ట్రాఫిక్‌తో భోగాపురం వరకు వెళ్లాలంటే వాహనదారులకు కత్తి మీద సామే. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలంటే సుమారు నాలుగు గంటలు ముందుగానే బయలుదేరాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసింది. విశాఖ నగరంలో మొబిలిటితో పాటు కనెక్టివిటీ పెంచేలా ఏడు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపడుతోంది.

వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మొత్తం 15 రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.. వాటిలో మొదటి విడతగా ఏడు ప్రధాన రహదారుల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. అన్ని అనుమతులు అభ్యంతరాలు తొలగిన చోట పనులు వేగవంతం చేశారు. గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన 7 రోడ్లలో తిమ్మాపురం- మారికవలస రోడ్డు 6.3 కిలోమీటర్లు 30 మీటర్ల వెడల్పు, అడవివరం- శొంఠ్యం రోడ్డు 8 కిలోమీటర్లు 30 మీటర్ల వెడల్పు, తాళ్లవలస- కొత్తవలస రోడ్డు 3.90 కిలోమీటర్లు 24 మీటర్ల వెడల్పు, బోయపాలెం- కాపులుప్పాడ రోడ్డు 3.10 కిలోమీటర్లు 24 అడుగుల వెడల్పు, వేపగుంట- పినగాడి రోడ్డు 3.20 కిలోమీటర్లు 18 మీటర్ల వెడల్పు, వేపగుంట- జుత్తాడ రోడ్డు 6.05 కిలోమీటర్లు 24 మీటర్ల వెడల్పు, భీమిలి- దొరతోట రోడ్డు 6.20 కిలోమీటర్లు 30 మీటర్ల వెడల్పు. ఈ ఏడు రోడ్లలో ఇప్పటికే తిమ్మాపురం- మారికవలస రోడ్డు విస్తరణ పూర్తయింది.

ఇక తాళ్లవలస- కొత్తవలస రహదారి నిర్మాణం పనులు 36 శాతం, బోయపాలెం- కాపులుప్పాడ రోడ్డు పనులు 58 శాతం పూర్తయ్యాయి. వేపగుంట- పినగాడి రోడ్డు విస్తరణ.. భూ సేకరణ సమస్యతో కాస్త ఆలస్యం అవుతుంది. జీవీఎంసీ ఆధ్వర్యంలో వేపగుంట- జుత్తాడ రోడ్డు పనులు, భీమిలి- దొరతోట రోడ్డును ఆర్‌అండ్‌బీ నిర్మాణం చేస్తుండగా.. మిగిలిన వాటి పనులను వీఎంఆర్డీఏ చేస్తోంది. ఈ క్రమంలోనే.. టార్గెట్‌కు ముందుగానే అన్ని సౌకర్యాలతో నాణ్యమైన రోడ్లను వేగంగా అందుబాటులోకి తెస్తామన్నారు వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్. ఇదిలావుంటే.. ఏడు రోడ్ల మాస్టర్‌ ప్లాన్‌లో కొన్నిచోట్ల భూసేకరణకు ఇబ్బందులు, అటవీ శాఖ అనుమతుల జాప్యంతో నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయి. ప్రధానంగా.. ఆర్ అండ్ బీ నిర్మించే భీమిలి- దొరతోట రోడ్డు సాంకేతిక సమస్యలు ఉండడంతో జాప్యమవుతోంది. 7 రోడ్ల విస్తరణ పనుల్లో ఇబ్బందులు తొలగించుకొని ముందుకు సాగుతున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమీక్షలు నిర్వహిస్తూ.. అమరావతి రేంజ్‌లో పనుల పురోగతిపై వీక్లీ ఆరా తీస్తున్నారు. భూ సేకరణ, అనుమతుల్లో జాప్యం ఉన్నప్పటికీ పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్తామన్నారు వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. ఏది ఏమైనా.. అక్కడక్కడ కొన్ని భూసేకరణలో జాప్యంతో పాటు సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటికీ సానుకూలంగా అధిగమించి విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ కంప్లీట్‌ చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు.

ఇది చదవండి: ఉద్యోగం చేసి విసిగిపోయారా.? కాలు కదపకుండానే ప్రతీ నెలా లక్షలు సంపాదించండి.. ఎలాగంటే

Follow Us