Horoscope Today: మంగళవారం రాశిఫలాలు.. వీరికి శుభఘడియలు.. వ్యాపారాల్లో మంచి లాభాలు
ఈరాశివారికి శుభఘడియలు నడుస్తున్నాయి. కీలక విషయాలు, ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. అనవసర విషయాలు, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
మేషం
ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ఉత్తమం.
వృషభం
పనిభారం, శ్రమాధిక్యం పెరుగుతాయి. ఒత్తిడి, ఆందోళను అధిగమించేందుకు మరింత కృషి చేయాలి. కుటుంబ సభ్యుల మాటలకు విలువనివ్వాలి. కలహాలకు చోటివ్వద్దు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.
మిథునం
ప్రారంభించిన పనుల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లాభిస్తుంది. ఒక వార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆదిత్య హృదయం పఠిస్తే బాగుంటుంది.
కర్కాటకం
ఈ రాశులవారికి శుభఘడియలు నడుస్తున్నాయి. సమయస్ఫూర్తి, బుద్ధిబలాంతో ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దత్తాత్రేయ స్వామి సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.
సింహం
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధనతో మేలు చేకూరుతుంది.
కన్య
శ్రమాధిక్యం పెరగకుండా చూసుకోవాలి. మనసుకు నచ్చినవారితో సంతోషంగా గడుపుతారు. ఆనందాన్ని పంచుకుంటారు. శుభవార్తలు వింటారు. దుర్గాస్తోత్రం చదివితే ఉత్తమం.
తుల
సన్నిహితులు, స్నేహితుల నుంచి అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారా రంగాలవారు శుభవార్తలు వింటారు. సమయస్ఫూర్తితో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.
వృశ్చికం
ఈరాశివారికి శుభఘడియలు నడుస్తున్నాయి. కీలక విషయాలు, ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. అనవసర విషయాలు, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
ధనస్సు
వీరికి ప్రతికూల పరిస్థితులు ఎదురువతాయి. చేపట్టిన పనుల్లో అనుకోని అవాంతరాలు. సమస్యలను పట్టుదలతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనసుకు ప్రశాంతత ఉంటుంది. నవగ్రహ ధ్యానంతో మేలు జరుగుతుంది.
మకరం
చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడి, ఆందోళనలను దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది
కుంభం
వీరికి మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు పొందుతారు. గోవింద నామాలు చదివితే మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందుతారు.
మీనం
వీరికి శుభకాలం. కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతారాధన మాత్రం మరవద్దు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి