AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. త్వరలోనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం కొత్త బీమా పాలసీని తీసుకురానుంది. ఈ విషయాన్ని మంత్రి సీతక్క తాజాగా ప్రకటించారు. అసలు ఈ పథకం వివరాలు ఏంటి..? ఎలా ఉపయోగపడుతుంది? అనే వివరాలు చూద్దాం

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..
Money
Venkatrao Lella
|

Updated on: Mar 04, 2026 | 7:58 AM

Share

తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. త్వరలో కొత్త పథకాన్ని వీరి కోసం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే ప్రభుత్వం రుణాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రుణ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా అందిస్తోంది. అయితే రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తూ మరణిస్తే.. కుటుంబంపై ఆ భారం పడుతుంది. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు లోన్ తిరిగి చెల్లించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డ్వాక్రా సంఘంలో ఇతర సభ్యులపై కూడా భారం పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు ఊరట కలిగించే పథకాన్ని త్వరలో తీసుకురానుంది.

బీమా పథకం

డ్వాక్రా మహిళల రుణానికి ప్రభుత్వం బీమా స్కీమ్‌ను అమలు చేయనుంది. త్వరలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తూ మరణిస్తే.. ప్రభుత్వమే మహిళ చెల్లించాల్సిన రుణాన్ని బ్యాంకుకు అందించనుంది. దీని వల్ల కుటుంబసభ్యులపై భారం తగ్గుతుంది. ఇందుకోసం ప్రతీ డ్వాక్రా మహిళకు రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది. ఈ బీమా సొమ్మును ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తుంది. ఇది రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ ప్రయోజనం చేకూర్చనుంది. ఇప్పటివరకు కుటుంబసభ్యులు చెల్లించాల్సి వచ్చేది. కుటుంబసభ్యులు చెల్లించని సమయంలో డ్వాక్రా సంఘంలోని ఇతర సభ్యులపై దీని ప్రభావం పడేది. రుణాలు చెల్లించని డ్వాక్రా సంఘాలను బ్యాంకులు బ్లాక్ లిస్టులో చేర్చుతున్నారు. దీని వల్ల కొత్త రుణాలు పొందేందుకు కష్టమవుతుంది.

సీతక్క కీలక ప్రకటన

త్వరలోని డ్వాక్రా మహిళలకు రుణ బీమా విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అలాగే మహిళలకు జీవిత బీమా కూడా కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ఇక డ్వాక్రా మహిళలు అకాల మరణం పొందితే కుటుంబసభ్యులు రుణం చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఇక డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి ఆర్ధిక భద్రత కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. 2024లో ఈ పథకం ప్రారంభమవ్వగా.. ఇప్పటివరకు 231 క్లెయిమ్స్‌ను పరష్కరించినట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఉపయోగపడేలా అనేక కార్యక్రామలను చేపడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మహిళలకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని పేర్కొన్నారు.

Follow Us
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో..
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు..