AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు! రేపట్నుంచే దరఖాస్తులు

హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఐదు ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 181 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జులై 29, 2026 నుంచి ఆన్‌లైన్‌లో..

హైదరాబాద్‌లో 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు! రేపట్నుంచే దరఖాస్తులు
Hyderabad Anganwadi Teacher Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 28, 2026 | 8:38 PM

Share

తెలంగాణ మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఐదు ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 181 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జులై 29, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్న ప్రభుత్వం ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల చేయగా, తాజాగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మేడ్చల్ జిల్లాలో కూడా ఇదే తరహా నోటిఫికేషన్ వెలువడింది.

ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • చార్మినార్‌లో పోస్టుల సంఖ్య: 40
  • గోల్కొండలో పోస్టుల సంఖ్య: 27
  • ఖైరతాబాద్‌లో పోస్టుల సంఖ్య: 17
  • నాంపల్లిలో పోస్టుల సంఖ్య: 38
  • సికింద్రాబాద్‌లో పోస్టుల సంఖ్య: 59

హైదరాబాద్‌లో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పరిస్థితిలో 10వ తరగతి ఉత్తీర్ణులను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్ధుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు స్థానిక మహిళలై ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డు, గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామపంచాయతీ పరిధిలో నివాసం ఉండటం తప్పనిసరి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 22, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్‌వాడీ టీచర్ పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (DSC) నిర్వహిస్తుంది. ఎంపికలో ఇంటర్మీడియట్ మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు. అదనంగా వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జులై 29, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 22, 2026.
  • ధ్రువపత్రాల పరిశీలన: ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 1 వరకు

హైదరాబాద్‌లో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us