AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఈ వస్తువును ఇంటికి తెచ్చుకోండి.. మీ ఆదాయం పెరుగుతుంది.. డబ్బు వర్షం కురుస్తుంది!

ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి నశిస్తుంది. దీని కారణంగా ఇంట్లో మంచి, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఇంట్లోని వారి కెరీర్‌లో ..

Astro Tips: ఈ వస్తువును ఇంటికి తెచ్చుకోండి.. మీ ఆదాయం పెరుగుతుంది.. డబ్బు వర్షం కురుస్తుంది!
Vastu Tips
Jyothi Gadda
|

Updated on: Nov 29, 2022 | 7:15 AM

Share

ఏ వ్యక్తి అయినా జీవితంలో డబ్బు, ఆనందం, శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేస్తాడు. కష్టపడి పనిచేస్తే జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. వాస్తు శాస్త్రంలోనూ సుఖవంతమైన జీవనం కోసం కొన్ని సులభమైన చర్యలను పేర్కొంది. వీటిని పాటిస్తే ఏ వ్యక్తి అయినా ధనవంతుడు కావడానికి ఎంతో కాలం పట్టదు. వాస్తు ప్రకారం మనం కొన్ని విషయాలను సరిగ్గా చూసుకుంటేనే ప్రగతి పథం తెరుచుకుంటుంది. అలాగే, ప్రతి వ్యక్తి తన ఇల్లు అందంగా కనిపించాలని కోరుకుంటాడు. దీని కోసం ఇంటిని అనేక వస్తువులతో అలంకరించుకుంటారు. ఇంట్లో అందమైన పూల మొక్కలను నాటితే పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం… ఇంట్లో నాటిన మొక్కలు ప్రతికూల శక్తిని నాశనం చేస్తాయి. ఇంటి మెయిన్ డోర్, కిటికీ దగ్గర అందమైన, సువాసనగల మొక్కలను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఈ మొక్కలు వ్యక్తి పురోగతికి అడ్డంకిని తొలగిస్తాయి. గులాబీ, బంతి పువ్వు, మల్లె, చంపా మొక్కలు నాటడం శుభపరిణామంగా భావిస్తారు. ఈ పూల మొక్కలు నాటడంతో వారి మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. అదృష్టం కూడా మద్దతు ఇస్తుంది.

ఇంట్లో తులసి, అరటి మొక్కలు నాటడం కూడా శుభప్రదమని వాస్తు నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భక్తులు లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అరటి మొక్కలో విష్ణువు ఉంటాడని చెబుతారు. అందుకే ఇంట్లో అరటి మొక్క, తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మి, విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఈ మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుంది. అదృష్టం వరిస్తుంది.

ఇవి కూడా చదవండి

క్రిస్టల్ బాల్ కూడా వాస్తులో శుభప్రదంగా పరిగణించబడుతుంది. అదృష్టాన్ని తీసుకురావడానికి సహజ కాంతి, గాలి కలగలిసిన చోట క్రిస్టల్ బాల్ ఉంచాలి. ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి నశిస్తుంది. దీని కారణంగా ఇంట్లో మంచి, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఇంట్లోని వారి కెరీర్‌లో ఏదైనా మంచి పని చేయడానికి ప్రేరేపిస్తుంది.

వాస్తు శాస్త్రంలో ఇంటి ఈశాన్య మూల శివుని స్థానంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రదేశంలో నీటిని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈశాన్య మూలలో ఇంటి పైకప్పుపై మట్టి కుండలో నింపిన నీటిని ఉంచడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. ఈ కంటైనర్ లో  నీటిని పకుల కోసం ఉండాలి. మీరు ఈ పరిష్కారం చేసిన రోజు నుండి మీ అదృష్టం మారుతుంది. ఇంట్లో డబ్బు రాక పెరుగుతుందని నమ్ముతారు.

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి