ఉసిరి నిజంగానే డయాబెటీస్‌ను తగ్గిస్తుందా? వాస్తవమేంటి?

16 August 2026

Anand T

ఉసిరి వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలుసుకు. అయితే దీన్ని తినడం వల్ల మధుమేహం తగ్గుతుందని కొందరు నమ్ముతారు. మరీ దీనిలో నిజమెంతా తెలుసుకుందాం పదండి

ఉసిరి

నిజానికి టైప్-2 మధుమేహాన్ని ఉసిరి పూర్తిగా నయం చేయలేము, దీనితోపాటు సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో కేవలం డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు అంతే.

అసాధ్యం

సాధారణంగా ఉసిరిలో క్రోమియం అనే ఇన్సులిన్ ఉంటుంది. ఇది నిరోధకతను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.

క్రోమియం ప్రభావం

అంతేకాదు ఇందులోని విటమిన్ సి పుస్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారిలో రోగనిరోధక శక్తిని పెంచి, అలసట, నీరసాన్ని తగ్గిస్తుంది.

విటమిన్ సి

ఉసిరిలోని పోషకాలు క్లోమ గ్రంథి పనితీరును బెటర్ చేసి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కాసిరిగా పెరగకుండా అడ్డుకుంటాయి.

ఇన్సులిన్ ఉత్పత్తి

మీ బాడీలో రోజంతా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలి అంటే ఉదయం పరగడుపున కొద్దిగా నీటిలో ఉసిరి రసం కలిపి తాగడం మంచిది

తీసుకునే విధానం

అయితే ఉసిరి అనేది డయాబెటీస్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది తప్పా.. పూర్తిగా నియంత్రించలేదు. కాబట్టి వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.

ముఖ్య గమనిక

ఈ సహజ చిట్కాలు పాటిస్తూనే.. క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మీరు బెటర్ అవుతున్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది.

టెస్ట్‌