చర్మ సమస్యలతో సతమతమవుతున్నారా..? వీటిని ఆచరిస్తే నక్షత్రంలా వెలిగిపోతారు..

ఈ సమయంలో చర్మం సాధారణంగా పొడిగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మీ చర్మం మెరుపును కోల్పోయే ప్రమాదం ఉంది. చర్మ సంరక్షణలో మూడు అంశాలను తప్పక చేర్చాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

చర్మ సమస్యలతో సతమతమవుతున్నారా..? వీటిని ఆచరిస్తే నక్షత్రంలా వెలిగిపోతారు..
Beautiful Skin
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 28, 2022 | 11:51 AM

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే చర్మ సంరక్షణ చాలా అవసరం. మాయిశ్చరైజర్లు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో, పొడిబారకుండా నిరోధించడంలో సహాయపడతాయి. చర్మ సంరక్షణలో సరైన పదార్థాలను చేర్చడం కీలకం. ఇది శీతాకాలంలో ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం. ఈ సమయంలో చర్మం సాధారణంగా పొడిగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మీ చర్మం మెరుపును కోల్పోయే ప్రమాదం ఉంది. చర్మ సంరక్షణలో మూడు అంశాలను తప్పక చేర్చాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దానివల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

మొదటిది తేనె. తేనె మంచి మాయిశ్చరైజర్. ఇది అత్యంత సహజమైనది. తేనె చర్మంలోని అన్ని ముడతలు, గుంతలను పూరించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా బాదంపప్పు. బాదంపప్పులను కొద్దిగా నీళ్లతో మెత్తగా మందపాటి పేస్ట్‌గా రుబ్బుకోవాలి. దీన్ని పాలతో కలిపి ముఖానికి పట్టించాలి. చర్మం అంతటా అప్లై చేయవచ్చు. చర్మాన్ని చాలా మృదువుగా ఉంచుతుంది

మెను సౌందర్యానికి పసుపు కూడా ముఖ్యమైనది. పసుపు చర్మానికి ఉత్తమమైనది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఇతర చర్మ సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. ఆ సహజమైన కాంతిని పునరుద్ధరించడానికి పసుపు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి