- Telugu News Photo Gallery Most Haunted Places In World: These Four places are considered as the world's most haunted
Haunted Places: ఇక్కడికి వెళ్లిన వాళ్లు తిరిగిరావడం ఇప్పటి వరకు జరగలేదు.. ఎన్నో ఏళ్లుగా దెయ్యాల స్థావరాలుగా..
మన భూమిపై ఉన్న ప్రదేశాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి. చంద్రమండలంపై ఇల్లుకడుతున్న ఈ తరానికి కూడా.. ప్రపంచంలోని ఈ ప్రదేశాలకు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే ఇవి మోస్ట్ 'హాంటెడ్ ప్లేస్'లుగా ముద్రపడిపోయాయి..
Updated on: Nov 28, 2022 | 11:47 AM

మన భూమిపై ఉన్న ప్రదేశాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇవి ప్రపంచంలోనో మోస్ట్ 'హాంటెడ్ ప్లేస్'లుగా ముద్రపడిపోయాయి. అవి ఎందు చేత అలా ఉన్నాయనే విషయాన్ని సైంటిస్టులు సైతం కనుక్కోలేక తలలు గోక్కుంటున్నారు. అటువంటి మర్మప్రదేశాలలో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

పోవెగ్లియా ద్వీపం.. ఇటలీలోని వెనిస్ నగరంలో ఉన్న ఈ ద్వీపం చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఐతే ఇక్కడ లెక్కలేనన్ని ఆత్మలు కూడా సంచరిస్తుంటాయని అంటుంటారు. అనేక పారానార్మల్ సంఘటనలు ఇక్కడ తరచూ ఎదురవుతూ ఉంటాయి. అందుకే ఈ ద్వీపాన్ని హంటెడ్ ప్లేస్‌గా చెప్పుకుంటారు. అంతేకాదు.. ఇక్కడికి మామూలు వ్యక్తులకు అనుమతి ఉండదు.

ఇస్లా డి లాస్ మునికాస్ ద్వీపం.. మెక్సికో నగరంలోని ఈ ద్వీపాన్ని 'డెడ్ డాల్స్ ఐలాండ్' అని కూడా అంటారు. ఈ ద్వీపంలో ఎక్కడ చూసినా చెట్లకు వేలాడుతున్న భయానక బొమ్మలు కనిపిస్తాయి. ఈ బొమ్మల తలలు, చేతులు కదులుతూ ఉంటాయట. అందుకే ఈ ప్రదేశాన్ని ఒంటరిగా సందర్శించడానికి ఎవరూ సాహసించరు.

ఐల్ ఆఫ్ వైట్.. ఇది ఇంగ్లాండ్‌లో ఉంది. ఈ ద్వీపంలోని దెయ్యాల గురించి కథలుకథలుగా చెప్పుకుంటుంటారు. ప్రతి యేట ఇక్కడ దెయ్యాల 'జాతర' జరుగుతుందని స్థానికులు చెబుతారు.

టవర్ ఆఫ్ లండన్.. హాంటెడ్ ప్రదేశాలలో ఇంగ్లాండ్‌లోని టవర్ ఆఫ్ లండన్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ టవర్ లోపల ఎన్నో ఆత్మలు సంచరిస్తూ ఉంటాయట. ఒకప్పుడు ఈ టవర్ లోపల చంపిన మనుషులకు చెందిన ఆత్మలే, ప్రేతాత్మలై తిరుగుతున్నాయని నమ్ముతారు.





























