ఈ ఫేమస్ సింగర్ తన ఫ్రెండ్‌కు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే బుర్ర బద్దలే.. ఇదేందిదీ నేను యాడా చూడ్లా

ఈ విచిత్ర బహుమతికి సంబంధించిన వార్తకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను 47 ఏళ్ల అమెరికన్ DJ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్‌ చేశారు. డ్రేక్ నుండి అందుకున్న నాలుగు టాయిలెట్ల ఫోటోను పోస్ట్‌ చేశారు.

ఈ ఫేమస్ సింగర్ తన ఫ్రెండ్‌కు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే బుర్ర బద్దలే.. ఇదేందిదీ నేను యాడా చూడ్లా
Luxurious
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 28, 2022 | 11:31 AM

మీ స్నేహితుల పుట్టినరోజున బెస్ట్ గిఫ్ట్ ఇవ్వడం గొప్పే కదా…కెనడియన్ రాపర్ డ్రేక్ తన స్నేహితుడు డీజే ఖలీద్ కు కూడా ఓ గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. టాయిలెట్ బౌల్! ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు టాయిలెట్ బౌల్స్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇదేం బహుమతి అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా…! కానీ, ఈ టాయిలెట్ అంత సులభం కాదు.. ఇది అసాధారణమైనది. విలాసవంతమైనది. ఈ బహుమతిని ఇచ్చినందుకు ఖలీద్ డ్రేక్‌కి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ టాయిలెట్ ధర చూస్తే మీరు షాక్ అవుతారు. మరి ఈ బహుమతి ప్రత్యేకత ఏంటో తెలిస్తే మీకు దిమ్మతిరిగిపోవాల్సిందే..

ఈ విచిత్ర బహుమతికి సంబంధించిన వార్తకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను 47 ఏళ్ల అమెరికన్ DJ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్‌ చేశారు. డ్రేక్ నుండి అందుకున్న నాలుగు టాయిలెట్ల ఫోటోను పోస్ట్‌ చేశారు. ఈ టాయిలెట్లు ఖలీద్ ఇంటికి అత్యవసరం అని, ఇవి నాణ్యమైన టాయిలెట్లు అని క్యాప్షన్‌లో రాసి పెట్టి ఉంది.

వీడియోతో పాటు, గాయకుడు ఇలా వ్రాశాడు.. నేను నా భార్య మా ఇంటికి ఇలాంటి కావాలని ఎదురుచూస్తున్నట్టుగా చెప్పారు. ఇంత మంచి అనుకున్న గిఫ్ట్‌ ఇచ్చిన ఫ్రెండ్‌కి ధన్యవాదాలు తెలిపాడు. ఇది సాధారణ టాయిలెట్ కాదు. ఎంబసీలో ఏర్పాటు చేసే మోడల్.’ ఇప్పటివరకు చూసిన వాటిల్లోకెల్లా అత్యంత అద్భుతమైన టాయిలెట్ బౌల్, ఇది అత్యుత్తమ బహుమతిగా వారు అభివర్ణించారు. ఇది రాయబార కార్యాలయంలో ఉన్నట్టుగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

టోటో నియోరెస్ట్ డ్యూయల్-ఫ్లష్ తయారు చేసిన వన్-పీస్ టాయిలెట్‌లో హై ఎఫిషియెన్సీ ఫ్లష్ ఫీచర్లు UV లైట్, UV క్లీనింగ్ సిస్టమ్, హీటెడ్ సీట్‌పై రిమోట్ కంట్రోల్, డ్యూయల్ ఫ్లష్, వివిధ వాష్ మోడ్‌లు, సెన్సార్లు ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ AP వాష్లెట్ సేకరణ నుండి టాయిలెట్ల ధర $2,346 (రూ. 1,91,597). ఇది డబ్బు గురించి కాదు, అతను నాకు ఉత్తమమైన బహుమతి ఇచ్చాడని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి