వామ్మో ఇదేం చేపరా దేవుడో.. సగం పాము, సగం డైనోసార్‌ షార్క్‌ రూపంతో భయపెడుతోంది..

డైనోసార్ల యుగం నుండి అంటే 80 మిలియన్ సంవత్సరాల నుండి ఈ జాతి భూమిపై ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వామ్మో ఇదేం చేపరా దేవుడో.. సగం పాము, సగం డైనోసార్‌ షార్క్‌ రూపంతో భయపెడుతోంది..
Giant Fish
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 28, 2022 | 9:19 AM

సముద్రం ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు నిధి. కంటికి కనిపించనంత అదృశ్య జీవుల నుండి భారీ జీవులకు నిలయం. కొన్నిసార్లు మనం చాలా విచిత్రమైన, భయానక సముద్ర జీవులను చూస్తాము. కాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ సముద్ర జీవి హాయిగా ఈత కొడుతోంది. కానీ చూడటానికి మాత్రం అది చాలా భయానకంగా ఉంది. దీని ఆకృతి వింతగా, విచిత్రంగా ఉండి ప్రతి ఒక్కరిని దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే దాని శరీరం సగం చేపలా ఉంటుంది. మిగిలిన సగం పాములా ఉంటుంది. వాటిలో కొన్ని ఇప్పటికీ సముద్ర డైనోసార్ల వలె కనిపిస్తాయి. ఇది చూసి నెటిజన్లు సైతం షాక్‌ అవుతున్నారు.

80 మిలియన్ సంవత్సరాల పురాతన సొరచేప వీడియో ఇది. ఈ వీడియో కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొంతమంది శాస్త్రవేత్తలు దీనిని పురాతన సొరచేప జాతిగా గుర్తించారు. ఇది 80 మిలియన్ సంవత్సరాల నుండి భూమిపై ఉందని చెబుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఇంత కాలం ఈ జీవి ఎలా బతుకుతుంది అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అరుదైన జీవిని షార్క్ (ఫ్రిల్డ్ షార్క్) జాతికి చెందినదనిగా చెబుతున్నారు జీవశాస్త్రజ్ఞులు. ఇది మిలియన్ల సంవత్సరాల నుండి భూమిపై ఉంది. దీనిని దెయ్యం షార్క్ అంటారు. దాని తోక పాము ఆకారంలో ఉంటుంది. ఇది ఈత కొట్టడానికి సహాయపడుతుంది. మిగిలిన చాలా భాగం షార్క్ లాగా ఉంటుంది. ఇది తన ఎరను సులభంగా పట్టి చంపడానికి సహాయపడుతుంది.

కాగా, ఈ వీడియో చాలా పాతదని తెలిసింది. 2007 నాటిది కాగా ఇప్పుడు ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ సమయంలో అది జపాన్‌లోని అవాషిమా మెరైన్ పార్క్‌లో తీసినట్టుగా తెలిసింది. డైనోసార్ల యుగం నుండి అంటే 80 మిలియన్ సంవత్సరాల నుండి ఈ జాతి భూమిపై ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్నది చేప కాదని అంటున్నారు. సాధారణంగా దీని వయస్సు సుమారు 25 సంవత్సరాలు. అయితే ఇంత కాలం గడిచినా అవి అదృశ్యం కాలేదు.

వీడియో వైరల్ అయినప్పటి నుండి ప్రజలు కామెంట్ చేయడం ప్రారంభించారు. ఏ జీవి కూడా అంత కాలం జీవించదు. శాస్త్రవేత్తలు కాబట్టి తప్పు అని ఒకరు రాశారు. మరొకరు దీనిని గ్రాఫిక్స్ వీడియో అని అంటున్నారు. దీంతో శాస్త్రవేత్తలు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ చేప 80 మిలియన్ సంవత్సరాల వయస్సు మాత్రమే కాదు, దాని జాతి కూడా చాలా పాతదని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి